Avasarala Srinivas: అవసరాల శ్రీనివాస్ సెటైర్లు అన్నీ ‘యానిమల్’ సినిమాపైనేనా?

Advertisement

అవసరాల శ్రీనివాస్ అందరికీ సుపరిచితమే. నటుడిగా, దర్శకుడిగా, రైటర్ గా, హోస్ట్ గా కూడా సత్తా చాటాడు. ‘అవతార్’ ‘బ్రహ్మాస్త్రం’ వంటి డబ్బింగ్ సినిమాలకి డైలాగ్స్ కూడా రాశాడు. ఇతను కీలక పాత్ర పోషించిన ‘పిండం’ సినిమా డిసెంబర్ 15 న రిలీజ్ కాబోతుంది. శ్రీరామ్, ఖుషీ రవి జంటగా నటించిన ఈ సినిమాతో సాయికిరణ్ దైదా దర్శకుడిగా పరిచయం అవుతుండగా, కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి నిర్మించారు.

ఇక ఈ చిత్రం ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు అవసరాల శ్రీనివాస్. ఈ సందర్భంగా ఆయన అనేక ఆసక్తికర విషయాలు పంచుకోవడం జరిగింది. ఈ క్రమంలో నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ కుమారి శ్రీమతి’ అనే వెబ్ సిరీస్ కి అవసరాల శ్రీనివాస్ డైలాగ్స్ అందించిన విషయాన్ని గుర్తుంచేశాడు. అలాంటి క్లీన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్ కి తాను పని చేయడం అనేది ఆనందాన్ని ఇచ్చింది అన్నాడు.

ఈ క్రమంలో అవసరాలకి.. ‘బోల్డ్ కంటెంట్ లేకుండా వచ్చిన క్లీన్ వెబ్ సిరీస్ కదా అది’ అనే ప్రశ్న ఎదురైంది. దీనికి ఆయన షాకింగ్ ఆన్సర్స్ ఇచ్చాడు. ‘బోల్డ్ కంటెంట్ అంటే ఏంటి? సెక్స్ సీన్లు, బూతులు మాత్రమే బోల్డ్ కంటెంట్ అనుకుంటున్నారా? ఆ సిరీస్ లో ఒక అమ్మాయి బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలి అనుకుంటుంది. అది కూడా బోల్డ్ కంటెంట్ అనే చెప్పాలి.

కొన్ని వెబ్ సిరీస్ లలో బెడ్ రూమ్ సీన్లు, బూతులు ఉండటం చూసి అదే బోల్డ్ కంటెంట్ అని అంతా అనుకుంటున్నారు. నా దృష్టిలో అలాంటి సన్నివేశాలు పెట్టే దర్శకులు మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. ఆ తర్వాత ‘ ‘యానిమల్’ సినిమా గురించేనా మీరు ఇలా అంటుంది?’ అంటూ ఓ రిపోర్టర్ అవసరాల శ్రీనివాస్ ని ప్రశ్నించాడు. దీనికి (Avasarala Srinivas) అవసరాల శ్రీనివాస్ ..’ అసలు ఆ సినిమా ఇప్పటివరకు నేను చూడలేదు’ అంటూ జవాబిచ్చాడు.

హాయ్ నాన్న సినిమా రివ్యూ & రేటింగ్!!

‘ఎక్స్ట్రా ఆర్డినరీ మెన్’ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో దాగున్న టాలెంట్స్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus