హిందీ సీరియల్ ‘బాలికా వధు’ (తెలుగులో చిన్నారి పెళ్లి కూతురు) ద్వారా పాపులారిటీని సంపాదించుకున్న అవికా గోర్… ఆ సీరియల్ క్రేజ్ తో సినిమాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ‘ఉయ్యాల జంపాల’ చిత్రంతో హీరోయిన్ గా మారిన ఈమె మొదటి సినిమాతోనే హిట్ అందుకుంది, ఆ తర్వాత ‘లక్ష్మీ రావే మా ఇంటికి’, ‘సినిమా చూపిస్తా మావ, ‘తను నేను’, ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’, ‘రాజుగారి గది 3’, ‘నెట్’, ‘బ్రో’ వంటి మూవీస్ తో మరింతగా ప్రేక్షకులకు దగ్గరైంది.
ఓ క్రమంలో ఈమె వెయిట్ పెరగడం వలన మానసికంగా కృంగిపోయి సినిమాలు వద్దనుకుంది. అద్దం ముందు తనని తాను చూసుకుని ఏడ్చేసేదట. అయితే అది ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని ఎన్నో వర్కౌట్లు చేసి సన్నబడింది. ప్రస్తుతం ఈ అమ్మడు ‘థాంక్యూ’, ‘టెన్త్ క్లాస్ డైరీస్’ వంటి సినిమాల్లో నటిస్తుంది. సామాజిక ఉద్యమకారుడు, ఎన్జీవో సంస్థ నిర్వాహకుడు అయిన మిలింద్ చంద్వానీతో అవికా గోర్ ప్రేమలో పడ్డ సంగతి తెలిసిందే.
త్వరలోనే అతన్ని పెళ్లి కూడా చేసుకోబోతుంది. తర్వాత సినిమాల్లో నటిస్తుందా లేదా అన్నది ప్రస్తుతానికైతే ఆమె సస్పెన్స్ గానే ఉంచింది. అయితే గ్లామర్ ఫోటో షూట్లు మాత్రం ఆమె చేస్తూనే ఉంది. ఈమె లేటెస్ట్ ఫోటోలు చూస్తుంటే ఈమె మరింతగా చిక్కిపోయిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ ఫోటోలని మీరు కూడా ఓ లుక్కేయండి :