Avika Gor: కనీసం అద్దంలో కూడా నన్ను నేను చూసుకోలేకపోయేదాన్ని : అవికా గోర్

  • January 31, 2022 / 08:17 PM IST

బాలికా వధు (తెలుగులో చిన్నారి పెళ్లికూతురు) సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు అవికా గోర్. ఈ ధారావాహికలో అమాయకత్వం, క్యూట్ లుక్స్‌తో ఆ తర్వాత పలు హిందీ సీరియల్స్‌తో పాటు సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంది అవికా. ఆ వెంటనే తెలుగులోనూ ఉయ్యాలా జంపాల సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి.. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తనూ నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, నెట్, బ్రో వంటి సినిమాలు చేశారు.

మధ్యలో వ్యక్తిగత కారణాల వల్ల ఆమె సినిమాలకు దూరమైంది. ఒకానొక దశలో అవికా సినిమాలకు శాశ్వతంగా వీడ్కోలు చెప్పేసిందంటూ ప్రచారం జరిగింది. అయితే వాటిని అవికా గోర్ కొట్టిపారేశారు. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చిన్నారి పెళ్లి కూతురు సీరియ‌ల్ చేసే స‌మ‌యంలో తాను ఏమాత్రం సంతోసంగా.. ప‌లు సంద‌ర్భాల్లో త‌న‌ని తాను ఆస‌హ్యించుకున్నా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు.. స్క్రీన్‌పై తన హావభావాలు ఎలా వున్నాయి, కాస్ట్యూమ్స్, మేకప్ విషయాలను కూడా ప‌ట్టించుకునే దాన్ని కాదని అవికా అన్నారు.

ప్రస్తుతం ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. అవిక తెలుగులో లేటెస్ట్‌గా థ్యాంక్యూ, టెన్త్ క్లాస్ డైరీస్ వంటి సినిమాల్లో నటిస్తున్నారు. సామాజిక ఉద్యమకారుడు, ఎన్జీఓ సంస్థ నిర్వాహకుడిగా వున్న మిలింద్ చంద్వానీతో అవికా గోర్ ప్రేమలో ఉన్నారు. ఆ విషయాన్ని ఆమె పలు సందర్భాల్లో తెలియజేశారు కూడా. అయితే ఇప్పట్లో తమకు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదని అవికా గోర్ వెల్లడించారు.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!


అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus