వీకెండ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో బిగ్‌బాస్ హౌస్‌లో ఫన్ మొదలైపోయింది. ‘కిల్లర్ కాయిన్స్’ టాస్క్‌తో ఇంట్లో పెరిగిన వేడిని చల్లారచ్చడానికి బిగ్‌బాస్ ఈ రోజు ఫ్యాషన్ షోను ఏర్పాటు చేసినట్లున్నాడు. పండగ కలను తీసుకొస్తూ కొత్త దుస్తులతో బిగ్‌బాస్ హౌస్ కలకలలాడిపోయింది. అయితే ర్యాంప్‌వాక్ ముగిశాక… అవినాష్‌ను బిగ్‌బాస్ అద్దంగా మార్చేశాడు. అతని ముందు హౌస్ అమ్మాయిలు కూర్చుంటే… అద్దం రియాక్షన్‌ను అవినాష్ చేసి చూపించాడు. అద్దం (అవినాష్) ముందు అమ్మాయిల వచ్చి కూర్చుంటే…
కొందరి మీద ఫన్నీ కామెంట్స్ చేయగా, కొందరి మీద షాకింగ్ కామెంట్స్ చేశాడు. అయితే గంగవ్వ మాత్రం ‘ముక్కు’ గురించి మాట్లాడి రిటర్న్ రెండు పంచ్‌లేసి వెళ్లిపోయింది. మోనాల్ దగ్గరకు రాగానే అద్దం తనంతట తానే ముందుకొచ్చేసింది. జుట్టును జుట్ట అని మోనాల్ నవ్వులు పూయించింది. నా ముఖం ఇలా ఎందుకు ఉబ్బిపోయింది అని అద్దంతో స్వాతి అడిగితే… ‘బాగా తింటే అవ్వదా మరి’ అని అద్దం చెప్పింది. కానీ ఏ మాటకామాట చెప్పుకోవాలి.
అచ్చ తెలుగు కట్టులో అమ్మాయిలు అదిరిపోతే, అదిరిపోయే లుక్ అబ్బాయిలు వావ్ అనిపించారు. పింక్ ట్రాన్స్పరెంట్ శారీలో మోనాల్, రెడ్ శారీలో హారిక, లైట్ పింక్‌లో ఆరియానా హాట్‌గా మారి ఇంట్లో వేడి పుట్టించారు. అయితే పట్టు చీరలో లాస్య, దివి, సుజాత, స్వాతి దీక్షిత్ పట్టు చీరలో మెరిశారు. ఇంకా ఈ ఫ్యాషన్ పరేడ్, అద్దం ముచ్చట్లు ఈ రోజు రాత్రి తెలుస్తాయి.