వర్మపై విరుచుకుపడుతున్న అయ్యప్ప భక్తులు!!!
- December 27, 2016 / 06:38 AM ISTByFilmy Focus
విమర్శించాలి అని ఒకరు అనుకుంటే ఎలా అయినా విమర్శించవచ్చు అని వర్మ విషయంలో వస్తున్న విషయాలు చూస్తుంటే అర్ధం అయిపోతుంది. విషయంలో లోకి వెళితే టాలీవుడ్ లో వర్మ తీసిన సంచలన చిత్రం వంగవీటి చాలా విమర్శలకు దారి తీస్తుంది. అయితే ఒక పక్క రాధా వర్గం వర్మ పై విరుచుకు పడుతూ ఇష్టం వచ్చినట్లు గొడవలు చేస్తుంటే, మరో పక్క మరో కొత్త వివాదం వర్మ మెడకు చుట్టుకుంది….విషయంలోకి వెళితే…‘వంగవీటి’ సినిమాలో వర్మ అయ్యప్ప స్వాములను కించపరిచాడంటూ కొందరు అయ్యప్ప భక్తులు హైదరాబాద్ కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.
‘వంగవీటి’ చిత్రంలో అయ్యప్ప మాల ధరించిన భక్తుని పాత్రలో ఒక నటుడు హత్యాకాండకు పాల్పడిన సీన్ ఉందని ఇది అయ్యప్ప స్వాములను కించపరచడమేనని వర్మ పై చర్యలు తీసుకోవాలని అయ్యప్ప భక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇడేమే పెద్ద విషయం కాదు అని కొట్టి పారేయడానికి లేదు కానీ…ఒకరకంగా చెప్పాలి అంటే మాత్ర రాధ వర్గం చేస్తున్న గొడవ వల్లే వర్మ ఇబ్బందులు పడతాడేమో అని ఆలోచిస్తూ ఉంటే, అదే క్రమంలో ఈ సరికొత్త కేసు మరో తలపోటు గా మారనుంది అని ఇట్టే అర్ధం అయిపోతుంది. ఏది ఏమైనా..మన వర్మ కి ఇలాంటివి పెద్ద లెక్క ఏమీ కాదులే…మరి ఈ గొడవలు ఏక్కడి వరకూ దారి తీస్తాయో చూడాలి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













