Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

  • October 2, 2026 / 05:53 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

అన్ని వర్గాల ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో రూపొందుతోన్న న్యూ ఏజ్ క్రైమ్ కామెడీ ‘బా బా బ్లాక్ షీప్’. దోనేపూడి చక్రపాణి సమర్పణలో చిత్రాలయం స్టూడియోపై వేణు దోనేపూడి నిర్మిస్తున్న ఈ మూవీకి గుణి మంచికంటి దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబ‌ర్ 9న సినిమా రిలీజ్ అవుతుంది. టిను ఆనంద్, ఉపేంద్ర లిమాయె, జార్జ్ మరియన్, అక్షయ్ ల‌గుసాని , విష్ణు ఓయ్, కార్తికేయ, విస్మయ శ్రీ, మాల్వీ మల్హోత్రా, క‌శ్య‌ప్‌, శుభలేఖ సుధాకర్, రాజారవీంద్ర‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. తాజాగా ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా..

ప్ర‌ముఖ‌ నటుడు ఉపేంద్ర లిమాయె మాట్లాడుతూ.. ‘‘ముందుగా నా ప్రాణస్నేహితుడు సందీప్ రెడ్డి వంగాకు నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నన్ను నా సొంత వాయిస్‌తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఆయనే. ఆయన చెప్పిన మాటలు అక్షరాలా నిజమయ్యాయి. ఆ తర్వాత హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటించే అవకాశం వచ్చింది. నేను ఎక్కడికి వెళ్లినా తెలుగు ప్రేక్షకులు నాపై కురిపించిన ప్రేమాభిమానాలు మర్చిపోలేను. వైశాఖ్, గుణి వచ్చి వినిపించిన ‘బా బా బ్లాక్ షీప్’ కథ నాకు చాలా విభిన్నంగా, ఆసక్తికరంగా అనిపించింది. నేను నా పాత్ర కంటే కథకే మొదటి ప్రాధాన్యత ఇస్తాను. కంటెంట్ బాగుంటేనే సినిమా ఒప్పుకుంటాను. తెలుగులో ఇది నా మొదటి పూర్తి స్థాయి పాత్ర. అందుకే ఈ మూవీ నా హార్ట్‌కి ఎంతో దగ్గరైంది. చిత్రాలయం లాంటి గొప్ప చరిత్ర ఉన్న బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ చేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. విష్ణు, సమృద్ధి, మాళవిక, అక్షయ్ వంటి తెలుగు యువ నటీనటులతో కలిసి పనిచేయడం ఎంతో ఉత్సాహాన్నిచ్చింది. దర్శకుడిగా గుణికిది మొదటి చిత్రమే అయినప్పటికీ కథను రాసుకున్న విధానం, దాన్ని తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉన్నాయి. సాధారణంగా సమాజంలో కూడు, గుడ్డ, గూడు ప్రాథమిక అవసరాలుగా భావిస్తారు.. కానీ దక్షిణాదిలో ముఖ్యంగా తెలుగు వారికి సినిమా కూడా ఒక ప్రాథమిక అవసరం. అంతటి సినిమా ప్రేమికులైన మీరంతా థియేటర్లలో ‘బా బా బ్లాక్ షీప్’ చూసి తప్పకుండా ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు.

నటుడు విష్ణు ఓయ్ మాట్లాడుతూ ‘‘మా ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్‌కు సహకరించిన వారికి ధన్యవాదాలు. ఈ సినిమా కథ విన్నప్పుడు నేను ఎంతగానో ఎంజాయ్ చేశాను. ఇందులో నా జోడీగా నటించిన నేపాల్ నటితో పాటు పలువురు ప్రతిభావంతులైన నటీనటులు నటించారు. ముఖ్యంగా జాతీయ అవార్డు గ్రహీత ఉపేంద్ర లిమాయే గారితో కలిసి పనిచేయడం గొప్ప అనుభవం. థియేటర్ నేపథ్యం ఉన్న ఆయన నటన ఒక మాస్టర్‌క్లాస్ లాంటిది. అలాగే నా చిరకాల మిత్రుడు అక్షయ్ లగుసాని ఈ చిత్రంలో అద్భుతంగా నటించాడు. రాబోయే రోజుల్లో అతను మరింత పెద్ద స్థాయికి వెళ్తాడనే నమ్మకం నాకుంది. మేఘాలయలో షూటింగ్ చేస్తున్నప్పుడు అక్కడి వాతావరణం, ప్రజలు మాకు ఎంతగానో సహకరించారు. సినిమాటోగ్రాఫర్ అజయ్ విజువల్స్ పరంగా ఎక్సలెంట్ వర్క్ చేశారు. నా మంచి స్నేహితుడైన దర్శకుడు గుణి, నిర్మాత వేణు గార్ల కలయికలో వస్తున్న ఈ తొలి ప్రయత్నం అక్టోబర్ 9న విడుదల కానుంది. ఈ సినిమా తప్పకుండా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు’’ అని చెప్పారు.

నటి మాల్వీ మల్హోత్రా మాట్లాడుతూ ‘‘‘బా బా బ్లాక్ షీప్ ’అనేది చాలా ఫన్, కొంచెం వెరైటీగా ఉండే ఒక ఆసక్తికరమైన టైటిల్. దర్శకుడు గుణి నాకు ఈ కథ చెప్పినప్పుడు నేను ఎంతో ఎగ్జైట్ అయ్యాను. ట్రైలర్‌లో నా పాత్రను పెద్దగా చూపించలేదు కానీ, థియేటర్లలో సినిమా చూసినప్పుడు మీకు ఒక మంచి సర్‌ప్రైజ్ దొరుకుతుంది. ఇందులో నా పాత్ర పేరు ‘రమ’, కొంచెం గ్రే షేడ్స్ ఉండే పాత్ర అది. ఈ మూవీ రెగ్యులర్ హీరో, హీరోయిన్ కథలా కాకుండా.. ప్రతి పాత్రకూ ఎంతో ప్రాధాన్యత ఉండే సినిమాగా రూపొందింది. ప్రతి ఒక్కరూ తమ పాత్రలను చాలా చక్కగా చేశారు. ముఖ్యంగా దర్శకుడు గుణి విజన్‌ను నమ్మి ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్లిన నిర్మాత వేణు గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. మేము ఈ సినిమాను మేఘాలయలోని అత్యంత అద్భుతమైన ప్రదేశాలలో షూట్ చేశాం. బహుశా పూర్తిగా అక్కడ చిత్రీకరించిన తొలి తెలుగు సినిమా ఇదే కావచ్చు.. ఈ సినిమా కోసం అంకితభావంతో పనిచేసిన సాంకేతిక నిపుణులకు, నటీనటులందరికీ ధన్యవాదాలు. అక్టోబర్ 9న మీరంతా కుటుంబంతో, స్నేహితులతో కలిసి థియేటర్లలోనే చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నటి సమృద్ధి ఆర్యాళ్ మాట్లాడుతూ ‘‘సినిమా కంటే కూడా, ఈ మూవీ యూనిట్‌తో వర్క్ చేస్తూ నేను పొందిన అనుభవం నాకెంతో ప్రత్యేకం. నటీనటులు, దర్శకుడు, నిర్మాతలు.. ఇలా ప్రతి ఒక్కరూ చాలా ఆప్యాయంగా చూసుకున్నారు. ఎక్కడా నేనొక కొత్తదాన్ననే భావన కలగనివ్వలేదు. తెలుగులో నాకు ఇది మొదటి సినిమా. భాష రాకపోవడం వల్ల మొదట్లో తెలుగు డైలాగ్స్ చెప్పడం కష్టంగా అనిపించి చాలా కష్టపడ్డాను. కానీ డైలాగులు బట్టీ పట్టి మరీ పూర్తి చేశాను. అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది. ఓవరాల్‌గా ఇదొక అద్భుతమైన అనుభవం, భవిష్యత్‌లో ఈ టీమ్‌తో మళ్లీ కలిసి పనిచేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

నటుడు అక్షయ్ లగుసాని మాట్లాడుతూ ‘‘నేను ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాలు కూడా చేస్తున్నాను. రాబోయే నాలుగు నెలల్లో అవి కూడా విడుదల కానున్నాయి. మీ అందరి సపోర్ట్, ఆశీస్సులు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మా ట్రైలర్‌ను లాంచ్ చేసి మాకు సపోర్ట్ అందించిన నాగ్ అశ్విన్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక సినిమా విషయానికొస్తే.. మేఘాలయలో ఎంతో ఇష్టపడి, కష్టపడి ఈ చిత్రాన్ని షూట్ చేశాం.. మేఘాలయ ప్రభుత్వం, నిర్మాత వేణు గారు ఎంతగానో సపోర్ట్ చేసినా.. ప్రతిరోజూ ఏదో ఒక కొత్త సమస్య ఎదురయ్యేది. మాతో పాటు పరుగులు పెడుతూ శ్రమించిన వేణు సార్‌‌కి థాంక్యూ సో మచ్. దర్శకుడు గుణి, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్, నటీనటులందరికీ ధన్యవాదాలు. అక్టోబర్ 9న విడుదలవుతున్న ‘బా బా బ్లాక్ షీప్’ సినిమాను మీరంతా థియేటర్లలోనే చూసి మాకు సపోర్ట్ చేయాలని కోరుతున్నాను’’ అన్నారు.

నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్‌కు, నటీనటులకు నా కృతజ్ఞతలు. జాతీయ అవార్డు గ్రహీత ఉపేంద్ర లిమాయే గారితో కలిసి ప్రయాణించడం నాకు గర్వంగా, ఎంతో గౌరవంగా ఉంది. అలాగే చెన్నై నుంచి వచ్చిన జార్జ్ మరియన్ గారు సహా ఇతర కమిట్‌మెంట్స్ వల్ల ఈ రోజు రాలేకపోయిన ఇతర ఆర్టిస్టులకు ధన్యవాదాలు. చివర నిమిషంలో పిలిచినా వచ్చి ఈవెంట్‌ను విజయవంతం చేసిన మా హీరోయిన్లు మాల్వీ మల్హోత్రా, సమృద్ధి ఆర్యాళ్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. వారితో పాటు మూవీ టీమ్ అంతా ఎంతో అంకితభావంతో పనిచేశారు. సాంకేతిక నిపుణుల విషయానికొస్తే, అద్భుతమైన విజువల్స్ అందించిన డీవోపీ అజయ్ మనసుపెట్టి పనిచేశారు. అలాగే స్టీఫెన్, ఆర్కాడో ఆనంద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సంగీతం సినిమాకు ప్రాణం పోశాయి. మా సినిమా అక్టోబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆ సమయంలో ఇతర పెద్ద సినిమాలు వస్తున్నా.. గతంలో కూడా ఇలాంటి పోటీలో మంచి కంటెంట్ ఉన్న చిన్న సినిమాలు అద్భుతాలు సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మా సినిమా కూడా అలాంటి విజయమే సాధిస్తుందని బలంగా నమ్ముతున్నాం. ముఖ్యంగా ఈ మూవీకి సహకారం అందించిన మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కె.సంగ్మా గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. షూటింగ్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు వారి ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం మాకు ఎంతో అండగా నిలిచింది. విదేశాలకు వెళ్లకుండా మన దేశంలోనే మేఘాలయ లాంటి అద్భుతమైన ప్రదేశాలను ప్రజలకు చూపించి, అక్కడి పర్యాటకాన్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనికోసం మేము ప్రత్యేకంగా ఒక కాంటెస్ట్ కూడా నిర్వహిస్తున్నాం. అది రేపు అనౌన్స్ చేస్తాం. అందులో గెలిచిన వారు తమ సొంత ఖర్చు లేకుండా మా మూవీ టీమ్ తరఫున మేఘాలయ ట్రిప్‌కు వెళ్లే అవకాశాన్ని కల్పిస్తున్నాం.. చివరగా, మా ట్రైలర్‌‌ను లాంచ్ చేసి మాకు మద్దతుగా నిలిచిన దర్శకుడు నాగ్ అశ్విన్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీరందరూ కుటుంబంతో కలిసి థియేటర్లలో ఈ సినిమాను చూసి ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

దర్శకుడు గుణి మంచికంటి మాట్లాడుతూ ‘‘ముందుగా నిర్మాత వేణు గారికి చాలా పెద్ద థాంక్స్. ప్రస్తుతం ఉన్న కాంపిటీషన్‌లో ఒక డెబ్యూ డైరెక్టర్‌కు సినిమా రావడం చాలా కష్టమైన విషయం. కానీ వేణు గారు నేను చెప్పిన ఒక్క నరేషన్‌తోనే ఈ సినిమాను ఓకే చేశారు. ఆ తర్వాత నెల రోజుల్లోనే టీమ్ మొత్తాన్ని సమకూర్చుకుని, మరో మూడు నెలల్లోనే ప్రీ-ప్రొడక్షన్, లొకేషన్ రెక్కీ అన్నీ పూర్తి చేసుకుని షూట్‌కి వెళ్లాం. మేఘాలయలో దాదాపు 28 రోజుల పాటు షూట్ చేశాం.. ముఖ్యంగా నా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌కి, రైటర్ అజయ్‌కి కృతజ్ఞతలు. మీరు ట్రైలర్, టీజర్‌లో చూసిన ఫన్ వెనుక తను ఒక బలమైన పిల్లర్‌లా నిలబడి స్క్రీన్‌ప్లే నుంచి షూట్ వరకు నాతోనే ప్రయాణించాడు. అలాగే ఎడిటర్ విజయ్ రేయింబవళ్లు తేడా లేకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌లా శ్రమించాడు. రీసెంట్‌గా ‘ఇరుముడి’తో హిట్ కొట్టిన ప్రొడక్షన్ డిజైనర్ సాహి సురేష్ గారు, ప్రతి పాత్రని స్టడీ చేసి కాస్ట్యూమ్స్, జ్యువెలరీ సమకూర్చిన కాస్ట్యూమ్ డిజైనర్ ప్రియాంక గారికి థాంక్స్. ఉపేంద్ర లిమాయే గారు సహా ఈ మూవీలోని నటీనటులందరికీ నా కృతజ్ఞతలు. ఇది రొటీన్ హీరో, హీరోయిన్, విలన్ తరహా సినిమా కాదు. ఇందులో కనిపించే ప్రతి పాత్ర ఎంతో కీలకం. మేఘాలయ లాంటి సవాలుతో కూడిన లొకేషన్లలో ఇంత తక్కువ సమయంలో పూర్తి చేయగలిగామంటే దానికి నటీనటులందరి సహకారమే కారణం. అక్టోబర్ 9న థియేటర్లలోకి వస్తోంది. కుటుంబ సమేతంగా వెళ్లి చూసి ఆనందించదగ్గ చక్కని క్లీన్ సినిమా ఇది. మీరంతా థియేటర్లలో చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు.

నటీనటులు :

టిను ఆనంద్, ఉపేంద్ర , జార్జ్ మరియన్, అక్షయ్ ల‌గుసాని, కార్తికేయ, అభినవ్, హర్ష, కిషోర్ కృష్ణ, విస్మయశ్రీ, మాల్వీ మల్హోత్రా, సమృద్ధి, విష్ణు ఓయ్, క‌శ్య‌ప్‌, రాజా ర‌వీంద్ర‌, కె.ఎల్.దామోదర్ ప్రసాద్, అనీష్ కురివిల్లా, కాదంబరి కిరణ్ తదితరులు

సాంకేతిక బృందం :

బ్యానర్ : చిత్రాలయం స్టూడియోస్
నిర్మాత : వేణు దోనేపూడి
సహ నిర్మాత: కొండల్ జిన్నా
దర్శకత్వం : గుణి మంచికంటి
క్రియేటివ్‌ ప్రొడ్యూస‌ర్‌: శ‌్వేత దోనేపూడి
సంగీతం : ఎల‌క్ట్రానిక్ కిలి, ఆనంద్ (Arcado)
ఆర్ట్ : సాహి సురేష్
ఎడిటింగ్ : విజయ్ ముక్తవరపు
కెమెరామెన్ : అజయ్ అబ్రహం జార్జ్
కో డైెరెక్టర్ : కిషోర్ కృష్ణ‌
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వైశాఖ్ నాయర్, శ్రీద దోనేపూడి
కాస్ట్యూమ్స్ : ప్రియాంక శ్రీనివాస్‌
కొరియోగ్రఫీ : జెడి. మాస్టర్
యాక్షన్స్ : వింగ్ చున్ అంజి
పి.ఆర్.ఒ : మోహన్ తుమ్మల

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Baa Baa Black Sheep Movie

Also Read

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

related news

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Inji Vellam: జనవరిలోనే వస్తారట.. కొంపదీసి సంక్రాంతి అని అనరు కదా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Mohan Babu vs Chiranjeevi: మాటల వార్‌ ఎఫెక్ట్‌: మరోసారి చిరంజీవి vs మోహన్‌బాబు అవుతుందా?

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

Mayookha: అక్టోబర్ 9న గ్రాండ్ గా విడుదల కానున్న ‘మయూఖ’

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

trending news

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

Thella Kagitham Review in Telugu: తెల్ల కాగితం సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

Rajinikanth, Ram Pothineni: రజనీకాంత్‌ అల్లుడికి హీరోయిన్‌ ఫిక్స్‌.. ఆ కాంబో రిపీట్‌ చేస్తూ…

4 hours ago
Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

Raaka: అనుకున్నదే జరిగింది.. రెండు పార్టులు పక్కా.. గ్రాండ్‌గా రివీల్‌

6 hours ago
Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

Dorothy Review in Telugu: డోరోతి సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

Don’t Trouble The Trouble Review in Telugu: డోంట్ ట్ర‌బుల్ ది ట్ర‌బుల్ సినిమా రివ్యూ & రేటింగ్!

11 hours ago

latest news

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది:  ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

పెద్ద సినిమాల పోటీలోనూ మా సినిమా అద్భుతాలు సృష్టిస్తుందనే న‌మ్మ‌కం ఉంది: ‘బా బా బ్లాక్ షీప్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో నిర్మాత వేణు దోనేపూడి

52 mins ago
Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

1 day ago
Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

1 day ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

1 day ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version