బాహుబలి 2 ప్రీమియర్ షోని రద్దు చేసిన చిత్ర బృందం

  • April 27, 2017 / 12:33 PM IST

బాహుబలి అభిమానులను నిరాశ పరిచే వార్త. బాహుబలి 2 ప్రీమియర్ షో లేదు. ఇది నిజం. అయితే.. తెలుగులో కాదు, హిందీలో. మహారాష్ట్రలోఈరోజు రాత్రి వేయాల్సిన ప్రీమియర్ షోలను రద్దు చేసేశారు. అలనాటి బాలీవుడ్ స్టార్ హీరో వినోద్ ఖన్నా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందారు. దీంతో ఈరోజు రాత్రి బాలీవుడ్ హీరోలకు వేయాల్సిన స్పెషల్ షోలతో పాటు, ప్రీమియర్ షోలను రద్దుచేస్తున్నట్లు కరణ్ జోహార్ ట్విట్టర్‌లో వెల్లడించారు.

‘‘బాలీవుడ్ అమితంగా ఇష్టపడే నటుడు వినోద్ ఖన్నా మరణానికి సంతాప సూచకంగా.. ఈ రోజు రాత్రి వేయాల్సిన బాహుబలి ప్రీమియర్‌ను రద్దు చేస్తున్నాం’’ అంటూ కరణ్ జోహార్ ట్వీట్ చేశారు. అతనితో పాటు రాజమౌళి కూడా వినోద్ ఖన్నా ఆత్మ శాంతించాలని కోరుతూ లెజండ్ నటుడు మృతికి నివాళిగా హిందీలో స్పెషల్ షో రద్దు చేస్తున్నట్లు ట్విట్టర్లో వెల్లడించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఎంపిక చేసిన థియేటర్లలో స్పెషల్ షోస్ యధావిధిగా ప్రదర్శిస్తారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus