ఒకరోజు ముందుగా ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు షురూ!

  • October 18, 2016 / 07:25 AM IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు ఒక రోజు ముందుగా ప్రారంభం కానున్నాయి. డార్లింగ్ జన్మదినం అక్టోబర్ 23. ఆ రోజు కంటే ముందు అంటే అక్టోబర్ 22 న దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి సంబరాలను మొదలు పెట్టనున్నారు. సాయంత్రం 4 గంటలకు బాహుబలి కంక్లూజన్ ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నారు.

ఆ ఇమేజ్ ని అభిమానులు ఫోన్ స్క్రీన్ సేవర్ గా చేసుకుంటుండగానే 360 డిగ్రీస్ బాహుబలి మేకింగ్ వీడియోస్ ని విడుదల అవుతుంది. ఈ వీడియో మనకి  సెట్ లో షూటింగ్ ని ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని ఇస్తుంది. ఆ వీడియోలో మునిగి ఉండగానే జక్కన్న మరో సర్ప్రైజ్ చేయనున్నారు. బాహుబలి వీఆర్ టీజర్ ప్రివ్యూ ని మనకి అందించనున్నారు. అంతటితో బాహుబలి బృందం ఆగడం లేదు.. బాహుబలి గ్రాఫిక్ నవల ప్రివ్యూ ని రిలీజ్ చేయనుంది.

వీటిలో ప్రతి ఒక్కటి స్పెషల్. ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు బాహుబలి అభిమానులకు వీటిని చూసి ఎంజాయ్ చేసేందుకు రాత్రంతా సరిపోదు. ఇలా రాజమౌళి ప్రభాస్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus