బాహుబలికి రీమేక్‌గా మహాబలి

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలు ఘనవిజయం సాధించాయి. బాహుబలి కంక్లూజన్ ఒక్కటే ప్రపంచవ్యాప్తంగా 1600 కోట్లను వసూలు చేసింది. ఈ మూవీ అనేక రికార్డులను.. అవార్డులను సొంతంచేసుకుంది. ఈ సినిమాని చైనా, జపాన్ లోను రిలీజ్ చేయాలనీ నిర్మాతలు గత కొన్ని రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం జపనీస్ భాషలో డబ్బింగ్ పూర్తి అయినట్లు తెలిసింది. ఈనెల 29 న జపాన్లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హాలీవుడ్ వాళ్ళు సైతం రీమేక్ చేయడానికి వెనుకాడే ఈ సినిమాలను భోజ్ పురి వాళ్లు మళ్ళీ తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నారు. దేశంలో చిన్న సినీ పరిశ్రమగా పేరొందిన భోజ్ పురి భాషలో అందించడానికి భోజ్‌పురి నటుడు దినేశ్‌లాల్‌ యాదవ్‌ ప్రయత్నిస్తున్నారు. షూటింగ్ కూడా మొదలెట్టారు.

ఈ విషయాన్ని ఆయన ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడిస్తూ సెట్స్‌లోని ఫొటోను షేర్‌ చేశారు. ఈ సినిమాకి “వీర్‌ యోధ మహాబలి” అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం సినిమా ప్రోమోలకు సంబంధించిన చిత్రీకరణ మహారాష్ట్రలోని ఓ గ్రామంలో జరుగుతోంది. 2018 జనవరి 15న టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇక్బాల్‌ భక్ష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. దినేశ్‌లాల్‌కి జోడీగా ఆమ్రపాలి దుబే నటిస్తున్నారు. అయితే ఇది రెండు పార్ట్ లుగా వస్తుందా? ఒకే సినిమాగా రానుందా? అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. అలాగే నిర్మాతలు ఈ చిత్ర రీమేక్ హక్కులను వాళ్ళకి ఇచ్చారా ? అనేది కూడా ఇంకా తెలియదు. బాహుబలి చిత్ర బృందం అధికార ప్రకటనకు అందరూ ఎదురుచూస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus