మహేష్ బాబు(Mahesh Babu) కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే.. త్రివిక్రమ్ తీసిన ‘ఖలేజా’ కచ్చితంగా టాప్ లిస్ట్‌లో ఉంటుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక నటుడిని చూసి స్వయంగా మహేష్ బాబు ఆశ్చర్యపోయారట. ఓ ఇంటర్వ్యూలో ఆ ఆసక్తికరమైన విషయాన్ని సూపర్ స్టార్ బయటపెట్టారు.ఆ వివరాలు ఏంటంటే.. ఖలేజా సినిమాలో చైతన్య అనే ఓ ఆర్టిస్ట్ నటించాడు.
అంతకుముందు ఇతను నాగచైతన్య ‘జోష్’ సినిమాలో కూడా కనిపించాడు. ఖలేజా షూటింగ్‌లో ఒక ఎమోషనల్ సీన్ ఉంది. అందులో చైతన్య.. మహేష్ బాబు చేయి పట్టుకుని ఏడవాలి.షాట్ అంతా రెడీ అయ్యాక.. మహేష్ బాబు తన అసిస్టెంట్స్‌తో ‘గ్లిజరిన్ తీసుకురండి’ అని చెప్పారు. కానీ వెంటనే ఆ ఆర్టిస్ట్ నవ్వుతూ ‘నాకు గ్లిజరిన్ వద్దు సర్’ అని చెప్పేశాడు. అది విన్న మహేష్ బాబు.. ‘వీడేంటి ఇలా చెప్తున్నాడు.. చూద్దాంలే’ అని మనసులో అనుకున్నారట.
కట్ చేస్తే.. కెమెరా ఆన్ చేసి యాక్షన్ చెప్పగానే ఆ నటుడు నిజంగానే ఏడ్చేశాడు. గ్లిజరిన్ చుక్క కూడా లేకుండా అతని కళ్ల నుంచి నీళ్లు రావడం చూసి మహేష్ బాబు షాక్ అయ్యారు. ఒక నటుడు అలా రియల్ ఎమోషన్ పండించడం చూసి తాను నమ్మలేకపోయానని మహేష్ చెప్పుకొచ్చారు. అంతేకాదు.. పూణే షెడ్యూల్ మొత్తంలో ఆ ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ టెర్రిఫిక్‌గా ఉందని సూపర్ స్టార్ మెచ్చుకున్నారు.
మహేష్ బాబు చైతన్య టాలెంట్‌కి ఎంతగా ఫిదా అయ్యారంటే.. ఆ తర్వాత వచ్చిన ‘1-నేనొక్కడినే’ సినిమాలో కూడా అతనికి ప్రత్యేకంగా ఛాన్స్ ఇప్పించారు. ఇక ‘ఖలేజా’ సినిమా విషయానికొస్తే.. మహేష్ మూడేళ్ల గ్యాప్ తర్వాత చేసిన ఈ మూవీ రిలీజ్ టైంలో ప్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ ఆ తర్వాత రీ రిలీజ్ చేయగా ఆడియెన్స్ దానికి ‘కల్ట్ క్లాసిక్’ కట్టబెట్టారు.బ్లాక్ బస్టర్ గా నిలబెట్టారు. అయితే చైతన్య మాత్రం ‘1 నేనొక్కడినే’ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు. కనుమరుగైపోయాడు.