Jr NTR: తారక్ అంత మంచి వ్యక్తి అంటున్న బాహుబలి వినయ్!

  • June 14, 2022 / 10:42 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రేక్షకులతో పాటు సెలబ్రిటీలలో కూడా అభిమానులు ఉన్నారు. బాహుబలి వినయ్ ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. తనకు జూనియర్ ఎన్టీఆర్ కు సినిమాల వల్లనే అనుబంధం ఏర్పడిందని ఆయన తెలిపారు. అశోక్ సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ తో చాలారోజులు కలిసి వర్క్ చేశానని బాహుబలి వినయ్ చెప్పుకొచ్చారు. దాదాపు 70 80 రోజుల పాటు తాను అశోక్ మూవీ షూటింగ్ లో పాల్గొన్నానని ఆయన అన్నారు.

తాను ఆ సమయంలో కొత్త బైక్ కొనుగోలు చేశానని ఆ బైక్ పై ఎన్టీఆర్ తో కారవాన్ నుంచి లొకేషన్ కు వెళ్లేవాడినని ఆయన తెలిపారు. తారక్ చాలా సరదాగా ఉంటారని ఆయన అన్నారు. యమదొంగ షూట్ సమయంలో ఒక షాట్ లో తారక్ తనను నిజంగానే కొట్టారని తారక్ అలా కొడితే తాను షాట్ మరిచిపోయి అలాగే ఉండిపోయానని ఆయన అన్నారు. ఎదుటివాళ్లకు ఏదైనా సమస్య ఉంటే తారక్ వెంటనే రియాక్ట్ అవుతారని ఆయన తెలిపారు.

తారక్ సెట్స్ లో ఫుల్లు సరదాగా ఉంటారని అస్సలు తట్టుకోలేమని బాహుబలి వినయ్ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్ నమ్ముకున్న ఫ్రెండ్స్ కు ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే పరిష్కరిస్తాడని తారక్ కు మంచి సాయ గుణం ఉందని బాహుబలి వినయ్ వెల్లడించారు. తారక్ కళ్లలో పవర్ ఉంటుందని ఆయన కామెంట్లు చేశారు.

తారక్ చాలా కూల్ పర్సన్ అని ఇప్పుడు కలిసినా వినయ్ ఎలా ఉన్నావ్ అని తారక్ పలకరిస్తారని బాహుబలి వినయ్ చెప్పుకొచ్చారు. ప్రభాస్, ఎన్టీఆర్, రవితేజ గుర్తు పెట్టుకుని మాట్లాడతారని ఆయన తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో కొరటాల శివ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటించనున్నారు. ఈ సినిమాకు హీరోయిన్ ఫైనల్ కావాల్సి ఉంది.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus