బాహుబలి 2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని 360 డిగ్రీస్ లో చూడవచ్చు

  • March 25, 2017 / 07:45 AM IST

దర్శకదీరుడు రాజమౌళి 360 డిగ్రీస్ వీడియోస్ ని బాగా పాపులర్ చేశారు. మహిష్మతి రాజ్యాన్ని 360 డిగ్రీస్ చూపించి కొత్త అనుభూతిని పంచారు. ఇప్పుడు బాహుబలి ప్రీ రిలీజ్ వేడుకను కూడా అదే విధానంగా చూసే అవకాశం కలుగుతోంది. బాహుబలి కంక్లూజన్ ఆడియో రిలీజ్ వేడుకను ఈ ఆదివారం వైభవంగా నిర్వహించాలని రాజమౌళి మొదట రానున్నారు. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మాహిష్మతి సెట్ లో వేదికను కూడా సిద్ధం చేశారు. ఏమైందో ఏమోగానీ ఆడియో రిలీజ్ కాస్త  ప్రీ రిలీజ్ ఫంక్షన్ గా మారిపోయింది. రేపు సాయంత్రం 6 గంటలకు మొదలయ్యే ఈ కార్యక్రమాన్ని ఎన్టీవీ వారు ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.

“RADEON .COM ” వారు 360 డిగ్రీస్ లో ఈ ఫంక్షన్ ని చూసే అవకాశాన్ని కల్పించారు. ఈ విధంగా ప్రత్యక్ష  ప్రసారమైన తొలి తెలుగు చిత్రం బాహుబలి 2 కావడం విశేషం. ఈ రకంగానూ బాహుబలి కంక్లూజన్ మరో రికార్డును తన జాబితాలో వేసుకుంది. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ,  సత్యరాజ్  తదితరులు పోటాపోటీగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 28 న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus