బాహుబలి 2 విషయంలో ఆలోచన మార్చుకున్న రాజమౌళి

  • March 23, 2017 / 06:37 AM IST

బాహుబలి కంక్లూజన్ ఆడియో రిలీజ్ వేడుకను ఈ ఆదివారం వైభవంగా నిర్వహించాలని రాజమౌళి బృందం ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో మాహిష్మతి సెట్ లో వేదికను సిద్ధం చేసింది. మరో మూడు రోజుల్లో ఈ ఫంక్షన్ ఉందనగా  ప్రీ రిలీజ్ ఫంక్షన్ మాట బయటికి వచ్చింది. ఈ మధ్య టాలీవుడ్ లో సినిమాలకు ఆడియో వేడుకలు కాకుండా, ప్రీ రిలీజ్ ఫంక్షన్ లు చేయడం అలవాటు అయింది. సో బాహుబలి 2 కూడా ఆడియో వేడుక కాకుండా ప్రీ రిలీజ్ కార్యక్రమం చేయాలనీ జక్కన్న డిసైడ్ అయినట్లు ఫిల్మ్ నగర్ వాసులు చెబుతున్నారు. ఈ వార్త నిజమయితే ఈ మూడు రోజుల్లో బాహుబలి పాటలు యూట్యూబ్ లో కొన్ని రిలీజ్ అయ్యే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

వారం క్రితం విడుదలయిన ఈ మూవీ ట్రైలర్ రికార్డులన్నిటినీ బద్దలు కొట్టుకొని దూసుకుపోతోంది. కోట్లల్లో వ్యూస్, లక్షల్లో లైక్స్ అందుకుని రిలీజ్ కి ముందే ఆదాయం తెచ్చి పెట్టింది. కీరవాణి స్వరపరిచిన  పాటలకు కూడా లాభాలు రావాలని రాజమౌళి ఈ ప్లాన్ వేసినట్లు భావిస్తున్నారు. యధావిధిగా ఆడియో రిలీజ్ వేదికపైనే పేరు మార్చి వేడుకను నిర్వహించనున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus