బాహుబలి కంక్లూజన్ విడుదలయ్యే థియేటర్ల సంఖ్య తెలిస్తే షాక్ తింటారు!

  • March 23, 2017 / 09:41 AM IST

ప్రస్తుతం సినీ ప్రియుల ఫోకస్ మొత్తం రాజమౌళి మలిచిన  బాహుబలి కంక్లూజన్ సినిమా పైనే ఉంది. ఈ చిత్రం గురించి ప్రతి విషయం ఆశ్చర్య పరుస్తోంది. గత వారం విడుదలయిన  ట్రైలర్ అత్యధిక వ్యూస్, లైక్లు అందుకొని రికార్డు నెల కొల్పగా, ఇప్పుడు మరో రికార్డు సాధించింది. దేశంలో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి చిత్రంగా ఘనతను సొంతం చేసుకోబోతోంది. దేశవ్యాప్తంగా 6500 థియేటర్లలో ఈ సినిమా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దేశంలో ఇంతటి సంఖ్యలో థియేటర్లలో ఓ సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం.

“భారత్‌లో ‘బాహుబలి-2′ 6500 థియేటర్లలో విడుదల కానుంది. భారత్‌లో అత్యధిక థియేటర్లలో విడుదలవుతున్న మొదటి సినిమా ఇదే’ అని ట్రేడ్‌ అనలిస్ట్‌ రమేశ్‌ బాలా ట్వీట్‌ చేశారు. ప్రభాస్,  రానా, అనుష్క, తమన్నా, సత్యరాజ్, రమ్యకృష్ణ తదితరులు నటించిన ఈ సినిమా  ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus