రాఘవ లారెన్స్ ‘ముని’ సిరీస్ తరహాలో తమిళంలో ‘ఆరణ్మనై’ సిరీస్ కూడా రూపొందుతున్న సంగతి తెలిసిందే.ఈ సిరీస్..లో భాగంగా ఆల్రెడీ ‘చంద్రకళ’ ‘కళావతి’ (Aranmanai 2) ‘అంతఃపురం'(Aranmanai 3) వంటి సినిమాలు వచ్చాయి. ఇందులో ‘చంద్రకళ’ బాగా ఆడింది. ‘కళావతి’ యావరేజ్ గా ఆడింది. ‘అంతఃపురం’ వచ్చి వెళ్లినట్టు తెలుగు ప్రేక్షకులకి తెలిసుండకపోవచ్చు. అయితే ఆ సిరీస్ లో భాగంగానే ఇప్పుడు నాలుగో మూవీ వచ్చింది. తమన్నా (Tamannaah Bhatia) , రాశీఖన్నాల (Raashii Khanna) స్పెషల్ సాంగ్ వల్ల ఈ సినిమా పై జనాల ఫోకస్ పడింది.
సుందర్.సి (Sundar. C) డైరెక్ట్ చేసిన ఈ సినిమా మే 03 న రిలీజ్ అయ్యి నెగిటివ్ టాక్ ను మూటగట్టుకుంది. తమిళంలో అయితే మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తెలుగులో కూడా టాక్ తో సంబంధం లేకుండా మంచి ఓపెనింగ్స్ వస్తున్నాయని చెప్పవచ్చు.మొదటి సోమవారం కూడా ఈ సినిమా పర్వాలేదు అనిపించింది. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 0.41 cr |
సీడెడ్ | 0.23 cr |
ఆంధ్ర(టోటల్) | 0.45 cr |
ఏపీ + తెలంగాణ(టోటల్) | 1.09 cr |
‘బాక్’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.8 కోట్లు. తెలుగు రాష్ట్రాల్లో 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.1.09 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి ఇంకో రూ.0.71 కోట్లు షేర్ ను రాబట్టాలి. నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ ఈ మూవీ బాగానే కలెక్ట్ చేసింది. వీక్ డేస్ లో ఈ సినిమా ఆశించిన స్థాయిలో రాబట్టడం లేదు.