SKN: రైతు కూతురి పెళ్లికి సాయంగా నిర్మాత!

  • November 20, 2023 / 01:17 PM IST

బేబీ సినిమా ద్వారా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నిర్మాత ఎస్ కే ఎన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బేబీ సినిమా ద్వారా నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా ద్వారా నిర్మాత భారీ స్థాయిలో లాభాలను అందుకున్నారు. ఈ సినిమా ద్వారా మరిన్ని లాభాలు రావడంతో ఈ సినిమాని హిందీలో కూడా రీమేక్ చేస్తున్నారు.

ఇక ఈ సినిమా ద్వారా కోట్లల్లో లాభాలు అందుకున్నటువంటి ఎస్ కే ఎన్ పలు సేవా కార్యక్రమాలలో కూడా బాగమవుతున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ రైతు తన కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బు మొత్తం చెదలు పట్టి పాడవడంతో గుండెలవిసెల విలిపించారు. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ రైతుకు అండగా నిర్మాత నిలిచారు.పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ రైతు ప్రతిరోజు కష్టపడుతూ సంపాదించిన డబ్బులను తన కుమార్తె పెళ్లి కోసం దాచుకున్నారు.

ఇలా ఆ రైతు దాదాపు రెండు లక్షల రూపాయల వరకు డబ్బును పోగు చేశారు. అయితే ఆ డబ్బుకు చెదలు పట్టాయో తెలియదు కానీ లేక ఎలుకలు కొరికాయో తెలియదు కానీ డబ్బు మొత్తం ఉపయోగించడానికి వీలు లేకుండా పోయింది. దీంతో ఆ రైతు కన్నీరు మున్నీరుగా విలపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఆ రైతుకు అండగా నిర్మాత (SKN) ఎస్కేఎన్ నిలిచారు.

తన కుమార్తె పెళ్లికి అవసరమయ్యే రెండు లక్షల రూపాయలను తాను అందజేస్తానని ఈ సందర్భంగా ఈయన తెలిపారు. మారుమూల పల్లెలో ప్రజలకు డబ్బును బ్యాంకులో నిల్వ చేసుకోవడం పట్ల అవగాహన లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వారికి ఇలాంటి వాటిపై అవగాహన కల్పించాలని పలువురు ఈ ఘటనపై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

జపాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జిగర్ తండ డబుల్ ఎక్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ వారం థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 35 సినిమాలు/సిరీస్..ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus