Bad Boy Karthik: బ్యాడ్ బాయ్ కార్తీక్ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్
- April 20, 2026 / 01:22 PM ISTByPhani Kumar
‘రంగబలి’ తర్వాత ఆల్మోస్ట్ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకుని యంగ్ హీరో నాగ శౌర్య చేసిన చిత్రం ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ‘శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ ‘ బ్యానర్ పై శ్రీనివాస్ రావు చింతలపూడి, విజయకుమార్ చింతలపూడి, అశోక్ కుమార్ చింతలపూడి నిర్మించారు.
Bad Boy Karthik
నూతన దర్శకుడు రమేష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. అనేక కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యమైంది. హీరో నాగ శౌర్యకి నిర్మాతలకి మధ్య మనస్పర్థలు రావడం వల్ల షూటింగ్ డిలే అయ్యింది.

మొత్తానికి సినిమాని కంప్లీట్ చేసి ఏప్రిల్ 17న రిలీజ్ చేయబోతున్నారు. టీజర్, ట్రైలర్స్ వంటివి ఏమాత్రం ఆసక్తిని క్రియేట్ చేయలేదు. థియేట్రికల్ బిజినెస్ కూడా సోసోగానే జరిగింది. ఒకసారి వాటి వివరాలు గమనిస్తే :
| తెలంగాణ | 1.20 cr |
| సీడెడ్ | 0.20 cr |
| ఆంధ్ర(టోటల్) | 0.78 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 2.18 cr |
| రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ | 0.12 cr |
| వరల్డ్ వైడ్ టోటల్ | 2.30 cr |
బ్యాడ్ బాయ్ కార్తీక్ సినిమాకి రూ.2.6 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.3 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. పాజిటివ్ టాక్ వస్తేనే తప్ప సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు లేవు అనే చెప్పాలి. చూడాలి ఏం జరుగుతుందో












