“బద్దక రత్న” అవార్డ్ గోస్ టు..
- August 24, 2016 / 02:13 PM ISTByFilmy Focus
చిన్న టాపిక్ లను తీసుకుని, చక్కగా నటించి, ఎక్కువ సేపు మన వెంట అనందం వెంటాడేలా చేసే మహాతల్లి మరో బుజ్జి వీడియోతో ఈ బుధవారం మన ముందుకు వచ్చేసింది. ప్రపంచంలో అత్యంత బద్దకస్తురాలిగా “బద్దక రత్న” లో నటిస్తూ లేజీ పీపుల్ ని కదిలించే ప్రయత్నం చేసింది.
బద్దకంలో డిగ్రీలు లేవుకాని .. రకాలు మాత్రం చాలా ఉన్నాయి. ఒకరు బట్టలు ఉతకడం అంటే వాయిదా వేస్తుంటారు.. మరొకరు షాప్ కి వెళ్లడానికి సాకులు చెబుతుంటారు.. మరికొందరు బెడ్ దిగడానికి ఇష్టపడరు.. ఇలా మన స్నేహితుల్లో ఒక్కొక్కరికి ఒక్కో విషయంలో బద్దకం. బద్దకస్తుల లిస్ట్ తయారు చేస్తే మొదటి స్థానంలో నిలిచే పాత్రలో జాహ్నవి తన నట విశ్వరూపాన్ని చూపించింది. మీరు ఎంత లేజీ అయినా ఈ వీడియో చూడడంలో మాత్రం బద్దకంగా ఉండొద్దు. ఎందుకంటే చాలా ఫన్ మిస్ అవుతారు కాబట్టి.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus














