మారుతున్న కాలంతోపాటు ప్రేక్షకులు సినిమా చూసే విధానంలో కూడా చాలా మార్పులొచ్చాయి. ఈమధ్యకాలంలో జనాలు కమర్షియల్ అంశాలకు, మాస్ ఫైట్స్ కు పెద్దగా వేల్యూ ఇవ్వడం లేదు. కంటెంట్ ను మాత్రమే పట్టించుకొంటున్నారు. కనీసం స్టార్స్ ఎవరు అనేది కూడా చూడడం లేదు, సినిమా బాగుంటే చాలు అనుకొంటున్నారు. ఆ కోవలో వచ్చిన తాజా చిత్రమే “బధాయ్ హో”. హిందీలో ఆయుష్మాన్ ఖురానా కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రం అక్కడ ఆల్రెడీ రికార్డులు క్రియేట్ చేస్తుంది. 50 ఏళ్ల వయసులో తన తల్లి గర్భవతి అవ్వడాన్ని 25 ఏళ్ల కొడుకు ఎలా స్వాగతించాడు అనేది సినిమా కాన్సెప్ట్. ఇదేమీ కొత్త కాన్సెప్ట్ కాదు.
ఒక గుజరాతీ షార్ట్ స్టోరీ. ఈ కథనే ఇప్పుడు తెలుగులోనూ రీమేక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అల్లు శిరీష్ లేదా ఆ రేంజ్ హీరోతో ఈ సినిమాను రీమేక్ చేస్తే తెలుగులోనూ సూపర్ హిట్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సొ, ఈ క్రేజీ కాన్సెప్ట్ ను మునుపటి ఆయుష్మాన్ సినిమా “విక్కీ డోనర్” తరహాలో అయిదారేళ్లు లేట్ గా రీమేక్ చేస్తారో లేక ట్రెండ్ కు తగ్గట్లుగా ఇమ్మీడియట్ గా రీమేక్ చేస్తారో చూడాలి.