2013 జులై 6 .. బాహుబలి చిత్రానికి తొలి క్లాప్ కొట్టిన రోజు. ఒక ఏడాదిలో అయిపోతుందనుకున్న చిత్రం రెండు పార్టులయింది. రెండు పార్టులకోసం రెండేళ్ళనుకున్న సమయం పెరుగుతూ వచ్చింది. మూడున్నరేళ్లు అయింది. ఇంతకాలం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరో చిత్రం గురించి ఆలోచించకుండా, కనీసం బయట ఫంక్షన్లకు అటెండ్ కాకుండా బాహుబలి కోసమే అంకితమయ్యారు. తన శరీరాన్ని కంట్రోల్ లో ఉంచుకోవడానికి ఇన్నేళ్లు డైటింగ్ ఫాలో అవుతూ, నిత్యం వ్యాయామం చేశారు. బాహుబలి ది కంక్లూజన్ కి సంబంధించిన షూటింగ్ డిసెంబర్ నాటికీ కంప్లీట్ అవుతుంది అనుకున్నారు.
కానీ కొన్ని ప్యాచ్ వర్క్ లు కారణంగా ఈ నెల కూడా ప్రభాస్ పనిచేశారు. ఎట్టకేలకు నేటితో షూటింగ్ కంప్లీట్ చేస్తున్నట్లు రాజమౌళి ట్విట్టర్లో ప్రకటించారు. “మూడున్నరేళ్లు ఈ చిత్ర జర్నీ సాగింది. థాంక్స్ డార్లింగ్. ఈ ప్రాజక్ట్ ని నువ్వు నమ్మినంతగా ఎవరూ నమ్మలేదు. అది నాకు చాలా సంతోషాన్నిచ్చింది” అంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. సో ఈ రోజు నుంచి ప్రభాస్ స్వేచ్ఛ జీవి కానున్నారు. ఈ నెలంతా బాడీ ని తగ్గించుకొని వచ్చే నెల నుంచి సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న మూవీ షూటింగ్ లో పాల్గొననున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.