బిగ్ బాస్ తెలుగు సీజన్ – 6 లో మొదటి కెప్టెన్ గా బాలాదిత్య గెలిచాడు. అంతేకాదు, హౌస్ మేట్స్ హృదయాలని కూడా గెలుచుకుంటున్నాడు బాలాఆదిత్య. సైలెంట్ గా వచ్చి ఇప్పుడు టైటిల్ ఫేవరెట్ గా నిలుస్తున్నాడు. నిజానికి బాలాదిత్య కెప్టెన్సీ టాస్క్ లో సెకండ్ ప్లేస్ వచ్చాడు. కానీ, ఫస్ట్ వచ్చిన గీతురాయల్ నేమ్ ప్లేట్ లో ఒక అక్షరం తప్పుగా పెట్టింది. దీంతో బాలాదిత్య విన్నర్ అయ్యాడు. అంతేకాదు, గీతు రాయల్ స్ట్రాటజీ అంటూ కొన్ని ట్రిక్స్ ప్లే చేసింది.
టాస్క్ లో ఇలాగే ఆడతాను అని, అది అన్ ఫెయిర్ అయినా, జెన్యూన్ కాకపోయినా నాకు గెలవడమే ముఖ్యం అని చెప్పింది. ఇక హౌస్ మేట్స్ అందరూ వరెస్ట్ పెర్ఫామర్ ఇచ్చినపుడు కూడా హౌస్ లో నాకు రిలేషన్స్ ఏమీ లేవని జస్ట్ మీరంతా నాకు కంటెస్టెంట్స్ మాత్రమే అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. బిగ్ బాస్ హౌస్ లో మొదటి కెప్టెన్ అయిన బాలాదిత్య చాలా కూల్ గా హౌస్ హార్మోనీ దెబ్బతినకుండా హౌస్ మేట్స్ కి పనులు చెప్తున్నాడు.
బాలాదిత్య హౌస్ మేట్స్ ని ట్రీట్ చేసే విధానానికి , గీతు మాట్లాడే మాటలకి ఎంతో వ్యత్యాసం కనిపిస్తోంది. బిగ్ బాస్ హౌస్ లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆదిత్య కేవలం తన బిహేవియర్ తోనే ప్రేక్షకులకి దగ్గరవుతున్నాడు. తన వాక్చాతుర్యంతో మాట్లాడుతూ, ఎవరినీ నొప్పించకుండా తమ తప్పులని చెప్తూ, తను కూడా నేర్చుకుంటూ హౌస్ లో ముందుకు దూసుకువెళ్తున్నాడు. ట్రాష్ టీమ్ లో ఉన్నా కూడా లాస్ట్ మినిట్ లో నామినేషన్స్ నుంచీ తప్పించుకున్నాడు.
అంతేకాదు, ఇప్పుడు సెకండ్ వీక్ నామనేషన్స లో కూడా కెప్టెన్ అయ్యాడు కాబట్టి సురక్షితుడు అయినట్లే. మరి బాలాదిత్య టైటిల్ ఫెవరెట్ గా రేసులో ముందుకు దూసుకుపోతున్నాడు. నొప్పించక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి అన్నట్లుగానే బాలాదిత్య గేమ్ సాగుతోంది. మరి ఇదే బాలాదిత్య స్ట్రాటజీ అయితే మాత్రం టైటిల్ రేసులో ఖచ్చితంగా ఉన్నట్లే. మరి చూద్దాం.. ఏం జరుగుతుంది అనేది. అదీ మేటర్.