Balagam Collections: సైలెంట్ గా బ్రేక్ ఈవెన్ సాధించిన ‘బలగం’.!

  • March 6, 2023 / 07:39 PM IST

‘దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్’ బ్యానర్ పై శిరీష్ స‌మ‌ర్ప‌ణ‌లో హ‌ర్షిత్ రెడ్డి, హ‌న్షిత నిర్మించిన చిత్రం ‘బలగం’. ప్రియ‌ద‌ర్శి, కావ్యా కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ‘జబర్దస్త్’ కమెడియన్ వేణు టిల్లు అలియాస్ వేణు ఎల్దండి ద‌ర్శ‌కుడు. మార్చి 3న రిలీజ్ అయిన ఈ చిత్రం ఫుల్ పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరూ ఎమోషనల్ గా కనెక్ట్ అయినట్టు చెప్పుకొచ్చారు.

నిజానికి ఈ సినిమా మౌత్ టాక్ తో కంటే కూడా కాంట్రావర్సీతోనే ఎక్కువ పాపులర్ అయ్యిందని చెప్పాలి. ఈ కథ నాది అంటూ ఓ జర్నలిస్ట్ మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేయడం.. ఆ తర్వాత దర్శకుడు వేణు కూడా మీడియా ముందుకు వచ్చి అదంతా అబద్ధం అని చెప్పడంతో ‘బలగం’ ఎక్కువగా వార్తల్లో నిలిచింది. దీంతో ఆదివారం నాడు ఈ మూవీ సైలెంట్ గా బ్రేక్ ఈవెన్ అవ్వడానికి కారణమైంది. ‘బలగం’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను ఒకసారి గమనిస్తే :

నైజాం 0.98 cr
సీడెడ్ 0.10 cr
ఆంధ్ర 0.16 cr
ఏపీ + తెలంగాణ 1.24 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.03 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 1.27 cr

‘బలగం’ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ.1.2 కోట్లు కాగా.. మొదటి వీకెండ్ పూర్తయ్యేసరికి రూ.1.27 కోట్ల షేర్ ను రాబట్టి బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.0.07 కోట్లు ప్రాఫిట్స్ ను అందించింది. నైజాంలో ఈ మూవీ బాగా కలెక్ట్ చేస్తుంది. ఈ వీకెండ్ కు కూడా పెద్ద సినిమాలు లేవు కాబట్టి.. కొంతలో కొంత ఈ మూవీ క్యాష్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. మరి ఛాన్స్ ను ఈ మూవీ వాడుకుంటుందో లేదో చూడాలి..!

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus