నందమూరి బాలకృష్ణ దిగ్విజయంగా 99సినిమాలు పూర్తి చేసేసాడు. అయితే తన 100వ సినిమా పవర్‌ఫుల్ గా ఉండాలి అని ఆశగా ఎదురు చూస్తున్న అభిమానుల ఆశలకు మాత్రం నీళ్ళు వదిలేసాడు అన్న టాక్ టాలీవుడ్ లో బలంగా వినిపిస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే…బాలయ్య 100వ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు….కొన్ని కోట్ల కళ్ళు ఆయన 100వ సినిమాకోసం ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే అనేక కధలు విని చివరకు క్రిష్ చెప్పిన ‘గౌతమీ పుత్ర శాతకర్ణ’ కధ ఒకే చేసాడని వార్తలు వచ్చాయి. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు విషయం అక్కడే ఉంది. ఈ చిత్రం టైటిల్ విషయంలో ఏదో వివాదం తలెత్తింది అని టాలీవుడ్ నుంచి బలంగా వినిపిస్తున్న టాక్. ఇంతకీ ఏంటి ఆ వివాదం..అంటే….‘గౌతమీపుత్ర శాతకర్ణి’ కథకు ‘యోధ’ అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అన్న ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయం ఆనోట..ఈ నోట పడి…బాలకృష్ణ అభిమానుల వరకు చేరుకోవడంతో బాలయ్య అభిమానులు తీవ్ర మనోవ్యధకు గురవుతున్నట్లు తెలుస్తుంది.
అసలే ప్రతిష్టాత్మకమైన 100వ సినిమా టైటిల్ పవర్‌ఫుల్ గా ఉండాలి అని అభిమానులు ఆశిస్తుంటే….కమర్షియల్ సినిమాను చూడాలి అని అభిమానులు కలలు కంటుంటే…ఇలాంటి సమయంలో…‘గౌతమీపుత్ర శాతకర్ణి’ నిర్ణయం నీరుకారిస్తే ఏకంగా ఒక డబ్బింగ్ సినిమా టైటిల్ లా ఉన్న ఈ ‘యోధ’ టైటిల్ బాలయ్య సినిమాకు పెట్టడం ఎంతవరకూ న్యాయం అని బాలయ్య అభిమానులు తమ అసంతృప్తిని బాలకృష్ణ దృష్టికి తీసుకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు టాక్. ఇక ఎవ్వరు ఏమనుకున్నా నిర్ణయం బాలయ్యదే కాబట్టి వేచి చూడాల్సిందే.