నటసింహ నందమూరి బాలకృష్ణ నటించిన గౌతమి పుత్ర శాతకర్ణి రికార్డులను తిరగరాస్తోంది. ఆయన ప్రతిష్టాత్మకంగా నటించిన వందో చిత్రం వంద కోట్ల కలక్షన్స్ సాధించే దిశగా దూసుకుపోతోంది. ఇదే జోష్ లో బాలయ్య 101 చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకుపోవాలని భావిస్తున్నారు. క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ చెప్పిన రైతు స్టోరీ బాగున్నప్పటికీ అది తుది రూపు దిద్దుకోవడానికి మరికొంత సమయం పట్టేట్టుఉంది. అందుకే మరో దర్శకునితో సినిమాను ప్రారంభించాలని బాలయ్య ఆలోచిస్తున్నారు. రీసెంట్ గా తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ చెప్పిన స్టోరీ బాలయ్యకు బాగా నచ్చిందని సమాచారం. సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజనీ కాంత్, విశ్వనటుడు కమలహాసన్ తదితర హీరోలతో అద్భుత చిత్రాలను తెరకెక్కించిన రవికుమార్ తనని కొత్తగా చూపిస్తారని బాలయ్య నమ్మకంతో ఉన్నారు.
అయితే నందమూరి అభిమానులు ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే కేఎస్ రవికుమార్ కి కొన్నేళ్లుగా మంచి హిట్ లేదు. ఆయన దర్శకత్వంలో 2014 లో వచ్చిన లింగా మూవీ పరాజయం పాలయింది. అప్పటి నుంచి అవకాశాలు కూడా తగ్గాయి. రెండేళ్లలో ఒక మూవీ మాత్రమే చేశారు. కాబట్టి అతనితో వద్దని బాలయ్యకు చెప్పారంట. ఫ్యాన్స్ సలహాను పాటిస్తారా? ప్లాప్ డైరక్టర్ కి తన నటనతో హిట్ ఇస్తారా? అనేది మరికొన్ని రోజుల్లో తెలియనుంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.