Veera Simha Reddy: బాలయ్య ఇచ్చిన సలహా వీరసింహారెడ్డికి ప్లస్ అయిందా?

  • January 15, 2023 / 11:01 AM IST

నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం వీరసింహారెడ్డి. సంక్రాంతి కానుకగా ఈనెల 12న విడుదలై ఈ మూవీ మిక్స్‌డ్‌ టాక్‌ తెచ్చుకుంది. బాలయ్య అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. ఫ్యామిలీ ఆడియన్స్‌ మాత్రం కాస్త ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా సినిమాలోని కొన్ని రక్తపాతం కలిగించే సీన్లు అభ్యంతరకరంగా ఉన్నాయని ఫ్యామిలీ ఆడియన్స్‌ చెబుతున్నారు. అయితే, అభిమానులకు పూనకాలు తెప్పించారు బాలయ్య. వారు సంక్రాంతి పండుగను ముందే చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా వీరసింహారెడ్డి మొదటి షో తోనే హిట్టు టాక్ సొంతం చేసుకుందని అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

మూవీ టీం నిన్న సాయంత్రం హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్మాతలు, ఫైట్ మాస్టర్స్, డైరెక్టర్ గోపీచంద్, వరలక్ష్మి శరత్ కుమార్, హీరో బాలయ్య కూడా హాజరయ్యారు. ఈవెంట్‌లో బాలకృష్ణ, సినిమా కోసం పని చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపాడు. అఖండ లాంటి భారీ విజయం తర్వాత దర్శకుడు గోపీ తనకు ఈ కథ చెప్పాడని బాలయ్య తెలిపారు. కరెక్ట్‌ మూవీ అని ఓకే చెప్పానని బాలయ్య చెప్పారు.

అందరూ ఇది ఫ్యాక్షన్‌, మాస్‌ మసాలా కథ అంటున్నారని కానీ ఇది అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ చిత్రమని వివరించారు. గోపీచంద్‌ తనకు చెల్లి పాత్ర గురించి చెప్పినప్పుడు తాను ఒక సలహా ఇచ్చానని బాలయ్య తెలిపారు. సస్పెన్స్‌ మెయింటైన్‌ చేద్దాం.. ఆ క్యారెక్టర్ గురించి సస్పెన్స్ మెయిన్‌టైన్ చేద్దాం అని డైరెక్టర్‌తో చెప్పినట్లు బాలయ్య వెల్లడించారు. ఆ పాయింట్ సినిమాలో హైలైట్‌గా నిలిచిందని బాలకృష్ణ తెలిపారు.

సిస్టర్ సెంటిమెంట్‌కి ఆడవాళ్లతో పాటు పురుషులు కూడా ఎమోషనల్‌ అవుతున్నారని, నవరసాలు కలిగిన సినిమా ఇదని బాలకృష్ణ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం ఎస్‌ఎస్‌ థమన్‌ అందించారు. హీరోయిన్‌గా శృతి హాసన్‌ నటించింది. విలన్‌గా కన్నడ నటుడు దునియా విజయ్‌, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ నటించారు. ఈ సినిమాను విజయవంతం చేసినందుకు బాలయ్య ధన్యవాదాలు తెలిపారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus