తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

మన తెలుగు సినిమాకి సంబంధించి కొందరి హీరోల మద్య సినిమా యుద్ధం మనకి తెలుసు. ఎన్టీఆర్-కృష్ణ నుండి మొదలు పెడితే బాలయ్య-చిరు వరకు కొందరు హీరోల సినిమాలు ఒకే టైం, ఒకే రోజు విడుదల అయ్యి ఒక సినిమా యుద్ధం వాతావరణం ఉండటం మనం చూస్తూనే ఉన్నాము.

అయితే ఇది మన పక్క రాష్ట్రము అయినా తమిళ్ నాడులో కూడా ఉంది…అక్కడ కూడా అజిత్ అండ్ విజయ్ లాంటి హీరోల మధ్య ఎన్నో ఏళ్లుగా కొనసాగుతూ వస్తుంది. ఈ సంక్రాంతి అజిత్ తునివు – విజయ్ వారసుడు సినిమా తో ఏకంగా 13 వ సారి బాక్సఫీస్ దగ్గర సై అంటే సై అంటూ పొంగల్ సినిమా యుద్దానికి సిద్ధమైపోయారు

1. వాన్‌మతి vs కోయంబత్తూర్‌ మప్పిళ్లై – 1996

1996 లో మొదటి సారి అజిత్ విజయ్ లు తలపడితే…ఇందులో విజయ్ సినిమా కోయంబత్తూర్ మాప్పిళ్ళై పెద్ద విజయం సాధించింది.

2. కల్లూరి వాసల్ vs పూవే ఉనక్కాగ – 1996

ఈ సారి కూడా విజయ్ దే విజయం….

3. కాలమెల్లమ్ కాతతిరుప్పెన్ vs నేసమ్ – 1996

పొంగల్ కి రిలీజ్ ఐన ఈ రెండు సినిమాల్లో మల్లి విజయ్ సినిమా కాలమెల్లం కాతిరుప్పేన్ సినిమానే హిట్ అయింది.




4. రెట్టయి జాడై వయసు vs కాదలిక్క మర్యాద – 1997

రెండు ప్రేమకథలే కానీ మళ్ళీ అజిత్ సినిమా ఆడలేదు…విజయ్ సినిమా మాత్రం రెండు వందల రోజులు ఆడింది.




5. యునాయి తేడి vs తల్లాదా మనంము తులమ్ – 1999

ఫైనల్ గా అజిత్ సినిమా హిట్ కొట్టింది… దీనితో పాటు రిలీజ్ అయినా విజయ్ సినిమా కూడా హిట్ కొట్టింది.




6. ఉన్నాయ్ కోడు ఎన్నై తరువేన్ vs ఖుషి – 2000

ఇక ఈసారి విజయ్-జ్యోతికల ఖుషి తమిళనాట సెన్సషనల్ హిట్ అయితే అజిత్-సిమ్రాన్ లా సినిమా మాత్రం ప్లాప్ అయింది




7. దీన vs ఫ్రెండ్స్ – 2001

అజిత్ దీన మంచి మాస్ హిట్ అయితే…విజయ్ చేసిన ఫ్రెండ్స్ సినిమా యూత్ ఫుల్ హిట్ అయింది.




8. విలన్ vs భగవతి – 2002

2002 లో వచ్చిన విలన్-భగవతి రెండు సినిమాలు మంచి హిట్స్ అయ్యి అటు థలా ఫాన్స్ ని ఇటు దలపతే ఫాన్స్ ని ఖుషి చేసాయి.




9. ఆంజనేయ vs తిరుమలై – 2003

ఈ సారి అజిత్ నటించిన ఆంజనేయ తో పాటు విజయ్ నటించిన తిరుమలై రెండు అంతగా ఆడలేదు.




10. పరమశివం vs ఆది – 2006

ఈ సారి మరో పొంగల్ రేస్ – ఈ పొంగల్ రేసులో విజయ్ ఆది గెలిస్తే అజిత్ నటించిన పరమశివం అంతగా ఆడలేదు.

11. ఆళ్వార్ vs పొక్కిరి -2007

తెలుగులో హిట్ అయినా పోకిరి సినిమాని విజయ్ పొక్కిరి గా రీమేక్ చేస్తే అక్కడ ఇండస్ట్రీ హిట్ అయింది…మరి వైపు అజిత్ సినిమా ప్లాప్ అయింది.

12. వీరం vs జిల్లా – 2014

ఒక ఏడు సంవత్సరాల గ్యాప్ తరువాత అజిత్ వీరం – విజయ్ జిల్లా సినిమాలు మళ్ళీ ఒకేసారి విడుదల అయ్యాయి…ఇందులో వీరం బాగా ఆడితే విజయ్ జిల్లా అంతంత ఆడింది.

13. తునివు Vs వారిసు – 2022

ఇక మళ్ళీ ఎనిమిదేళ్ల తరువాత అజిత్-విజయ్ లు ఇద్దరు తునివు – వారిసు (తెగింపు – వారసుడు) సినిమాలతో మళ్ళీ పొంగల్ యుద్దానికి సిద్ధం అయ్యారు ఈ సారి ఎవరు గెలుస్తారో చూడాలి …

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus