‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!

సంక్రాంతి అనేది తెలుగు ప్రేక్షకులకు చాలా గొప్ప పండుగ, ఇష్టమైన పండుగ అని చెప్పుకోవాలి. ఈ పండుగకు ప్రతి ఒక్కరూ తమ సొంత ఊర్లు వెళ్లి చిన్ననాటి స్నేహితులను కలుసుకుని, జాతర్లలో తిరిగి, కోడిపందాలు, గుండాటలు ఆడి.. ఇంట్లో పిండి వంటలు తిని చివరకు సినిమాలకు వెళ్తారు. అందుకే ఈ పండుగ బాక్సాఫీస్ కు పెద్ద పండుగ అని చెప్పాలి. ప్రతి పండుగను ప్రేక్షకులు సినిమా థియేటర్లలోనే సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతికి ఇంకాస్త ఎక్కువే ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎటువంటి సినిమా వచ్చినా ఈ సీజన్లో భారీ కలెక్షన్లు కలెక్ట్ చేస్తూ ఉంటుంది. అయినప్పటికీ కొన్ని సినిమాలు సంక్రాంతి సీజన్లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులకు చేదు అనుభవాలను మిగిల్చాయి. ఏడాదికి ఓ సినిమా చొప్పున సంక్రాంతి సీజన్లో నిరాశపరిచిన సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) మృగరాజు :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ 2001 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.అభిమానులను కూడా ఈ మూవీ అలరించలేకపోయింది.

2) దేవీపుత్రుడు :

వెంకటేష్ హీరోగా కోడి రామకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2001 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

3) టక్కరి దొంగ :

మహేష్ బాబు – జయంత్ సి పరాన్జీ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ 2002 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

4) నాగ :

ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ మూవీ 2003 సంక్రాంతికి రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ అయ్యింది.

5) ఆంధ్రావాలా :

ఎన్టీఆర్ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2004 న్యూ ఇయర్ మరియు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి పెద్ద డిజాస్టర్ అయ్యింది.

6) అంజి :

చిరంజీవి – కోడి రామకృష్ణ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ 2004 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

7) నా అల్లుడు :

ఎన్టీఆర్ హీరోగా రూపొందిన ఈ మూవీ 2005 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

8) చుక్కల్లో చంద్రుడు :

సిద్దార్థ్ హీరోగా నటించిన ఈ మూవీ 2006 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

9) ఒక్క మగాడు :

బాలకృష్ణ హీరోగా వై.వి.యస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2008 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

10) పరమ వీర చక్ర :

బాలకృష్ణ హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ 2011 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

11) అనగనగా ఓ ధీరుడు :

సిద్ధార్థ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ 2011 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

12) 1 నేనొక్కడినే :

మహేష్ బాబు – సుకుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ 2014 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

13) అజ్ఞాతవాసి :

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ 2018 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

14) వినయ విధేయ రామ :

రాంచరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ఈ మూవీ 2019 సంక్రాంతికి రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

15) ఎన్టీఆర్ కథానాయకుడు :

ఎన్టీఆర్ బయోపిక్ లో భాగంగా రూపొందిన ఈ మూవీ 2019 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి డిజాస్టర్ అయ్యింది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus