Waltair Veerayya Review In Telugu: వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • చిరంజీవి, రవితేజ (Hero)
  • శ్రుతిహాసన్ (Heroine)
  • ప్రకాష్ రాజ్, రాజేంద్రప్రసాద్ (Cast)
  • బాబీ కొల్లి (Director)
  • నవీన్ ఎర్నేని - రవిశంకర్ (Producer)
  • దేవీశ్రీప్రసాద్ (Music)
  • ఆర్ధర్ ఎ.విల్సన్ (Cinematography)
  • Release Date : జనవరి 13, 2023

“గాడ్ ఫాదర్”, “ఆచార్య”ను మరిచిపోయేలా చేసిన చిరంజీవి టైటిల్ పాత్రలో తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ “వాల్తేరు వీరయ్య”. 2000 సంవత్సరంలో వచ్చిన “అన్నయ్య” తర్వాత చిరంజీవి-రవితేజ కలిసి నటించిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ట్రైలర్ కూడా ఆ అంచనాలను ఇంకాస్త పెంచింది. మరి సినిమా పరిస్థితి ఏంటో చూద్దాం..!!

కథ: వైజాగ్ లోని జాలర్ల పేటలో ఉంటూ తన చుట్టూ ఉన్నవాళ్లకు సహాయం చేస్తూ ఉంటాడు వీరయ్య అలియాస్ వాల్తేరు వీరయ్య (చిరంజీవి). సోలోమన్ (బాబీసింహా) అనే డ్రగ్ మాఫియా లీడర్ ను పట్టుకోవడం కోసం సహాయం చేయమని ఇన్స్పెక్టర్ (రాజేంద్రప్రసాద్) కోరడంతో మలేసియా వెళతాడు.

కట్ చేస్తే.. వీరయ్య మలేసియా వచ్చింది ఇన్స్పెక్టర్ కోసం సోలోమన్ ను పట్టుకోవడానికి కాదని, అతడి అన్నయ్య మైఖేల్ (ప్రకాష్ రాజ్) కోసమని తెలుస్తుంది.

అసలు మైఖేల్ కి, వీరయ్యకి ఉన్న వైరం ఏమిటి? ఈ కథలో అసిస్టెంట్ కమిషనర్ విక్రమ్ సాగర్ (రవితేజ) పాత్ర ఏమిటి అనేది తెలుసుకోవాలంటే “వాల్తేరు వీరయ్య” చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: “ఖైదీ నెం.150” అనంతరం చిరంజీవి బెస్ట్ లుక్స్ & మ్యానరిజమ్స్ మళ్ళీ ఈ వీరయ్య పాత్రలోనే కనిపించాయి. అలాగే.. ఆయన అభిమానులు మిస్ అవుతున్న డ్యాన్సులు కూడా ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. ఇక యాక్షన్ బ్లాక్స్.. ముఖ్యంగా ఇంట్రడక్షన్ & ఇంటర్వెల్ బ్లాక్ ను డిజైన్ చేసిన తీరు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయం. అలాగే.. చిరంజీవి కామెడీ టైమింగ్ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచింది.

రవితేజ స్క్రీన్ ప్రెజన్స్ & ఎనర్జీ అదిరిపోయాయి. చిరంజీవితో కాంబినేషన్ సీన్స్ & సెంటిమెంట్స్ బాగున్నాయి. అయితే.. తెలంగాణ యాసలో సహజత్వం లేకపోవడంతో.. కాస్త ఎబ్బెట్టుగా ఉంది.

శ్రుతిహాసన్ పాటలకు మాత్రమే పరిమితమవ్వకుండా.. ఆమె పాత్ర సినిమాలో కీలకంగా ఉండడం కాస్త ఊరటనిచ్చింది. కేతరీన్ తనకు లభించిన లిమిటెడ్ సీన్స్ లో పర్వాలేదనిపించుకుంది.

బాబీ సింహా విలన్ గా ఆకట్టుకున్నాడు. ప్రకాష్ రాజ్, మెయిన్ విలన్ అయినప్పటికీ.. సరిగా ఎలివేట్ అవ్వలేదు.

సాంకేతికవర్గం పనితీరు: ఆర్ధర్ ఎ.విల్సన్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి హై ఇచ్చింది. చిరంజీవి ఇంట్రడక్షన్ & ఇంటర్వెల్ బ్లాక్స్ కి పెట్టిన క్లోజప్ షాట్స్ & ఫ్రేమ్స్ బాగున్నాయి. దేవిశ్రీప్రసాద్ అందించిన పాటలు పెప్పీగా ఉన్నాయి, నేపధ్య సంగీతం పర్వాలేదు అనిపించింది. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ వర్క్ బాగుంది. “పూనకాలు లోడింగ్” పాటను కంపోజ్ చేసిన తీరు ఆడియన్స్ ను విశేషంగా ఆకట్టుకుంటుంది.

దర్శకుడు బాబీ కొల్లి చాలా సింపుల్ రివెంజ్ స్టోరీని.. చక్కని స్క్రీన్ ప్లేతో అలరించే విధంగా తెరకెక్కించాడు. అందువల్ల.. సినిమా ఎక్కడా బోర్ కొట్టకుండా సాగింది. అలాగే.. చిరంజీవి కామెడీ టైమింగ్ ను వాడుకున్న తీరు బాగుంది. ఓవరాల్ గా దర్శకుడిగా బాబీ మాస్ ఆడియన్స్ & మెగా ఫ్యాన్స్ ను ఖుషీ చేయగలిగాడనే చెప్పాలి.

విశ్లేషణ: చిరంజీవి సినిమా నుంచి అభిమానులు ఏవేం కోరుకుంటారో.. సదరు అంశాలన్నీ పుష్కలంగా ఉన్న చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఎలివేషన్ సీన్స్ & చిరంజీవి డ్యాన్సులు సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. చిరంజీవి కామెడీ టైమింగ్ & కామెడీ సీన్స్ పుష్కలంగా ఉన్నాయి కూడా. సో, సంక్రాంతికి ఫ్యామిలీతో కలిసి వీరయ్య మాస్ ను ఎంజాయ్ చేసేయొచ్చు!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus