సింహా, లెజెండ్ సినిమాల తరువాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న అఖండ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మే 28వ తేదీన రిలీజ్ కాబోతున్న అఖండ సినిమాతో బాలకృష్ణ సక్సెస్ ట్రాక్ లోకి వస్తారని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ హక్కులకు భారీగా డిమాండ్ ఏర్పడగా శాటిలైట్ హక్కుల కొరకు ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానెల్స్ పోటీ పడుతున్నాయి. అఖండ డిజిటల్ హక్కులను హాట్ స్టార్ ఏకంగా 15 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
అఖండ శాటిలైట్ హక్కులు స్టార్ మా ఛానల్ కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. దాదాపు 70 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే సగం బడ్జెట్ రికవరీ అవుతుండటం గమనార్హం. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి ఈ సినిమా విడుదలకు ముందే ఎక్కువ మొత్తంలో లాభాలను తెచ్చిపెడుతోంది. మరోవైపు ఈ సినిమాలో బాలకృష్ణ మూడు పాత్రల్లో నటిస్తున్నాడని ప్రచారం జరుగుతోంది. ఉగాది పండుగ రోజున అఖండ సినిమా సెకండ్ టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు 23 మిలియన్ల వ్యూస్ వచ్చాయి.
ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోందని బాలకృష్ణ శ్రీకాంత్ తో తలపడే సన్నివేశాలను బోయపాటి శ్రీను చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. లెజెండ్ సినిమాతో జగపతిబాబుకు పవర్ ఫుల్ విలన్ గా గుర్తింపు తెచ్చిన బోయపాటి శ్రీను శ్రీకాంత్ ను మరింత పవర్ ఫుల్ గా చూపిస్తున్నారని సమాచారం. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Most Recommended Video
‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!