Balakrishna, Anil Ravipudi: బాలయ్య అభిమానులు ఇది కొంచెం బ్యాడ్ న్యూసే..!

  • June 22, 2021 / 04:28 PM IST

టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్ లో స్థానం సంపాదించుకున్నాడు యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఈయన తెరకెక్కించేవి యావరేజ్ కంటెంట్ ఉన్న సినిమాలే అయినప్పటికీ.. ప్రేక్షకులను అలరించేలా వాటిని చిత్రీకరిస్తూ ఉంటాడు.అనిల్ సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ కు.. కామెడీకి ఢోకా ఉండదు. అందుకే ఈయన సినిమాలను మళ్ళీ మళ్ళీ చూస్తుంటారు ప్రేక్షకులు. మాస్ పల్స్ బాగా తెలిసున్న దర్శకుడు కాబట్టి.. అతని డైరెక్షన్లో బాలయ్య సినిమా రావాలని అభిమానులు కోరుకున్నారు.

ఆ మాటకొస్తే అనిల్ రావిపూడి కూడా బాలయ్యకి పెద్ద ఫ్యాన్. ఆయనతో సినిమా చేయాలని కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నాడు. ఇదే విషయాన్ని అనిల్ చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు. అయితే మొత్తానికి ఇతనితో సినిమా చేయడానికి బాలయ్య ఓకే చెప్పాడు. అదే విషయాన్ని ఇటీవల బాలయ్య ఓ సందర్భంలో ప్రేక్షకులకు తెలియజేసాడు.అయితే వీరి కాంబోలో వచ్చే మూవీకి చాలా టైం పడుతుంది అనేది తాజా సమాచారం. 2022 ఫిబ్రవరి లేదా మార్చిలో.. బాలయ్య- అనిల్ ల మూవీ స్టార్ట్ అవుతుందని అంచనా.!

ఎందుకంటే, అనిల్ తన ‘ఎఫ్3’ మూవీని కంప్లీట్ చేయాలి. అలాగే బాలయ్య కూడా బోయపాటి డైరెక్షన్లో ‘అఖండ’ మరియు గోపిచంద్ మలినేని ల మూవీస్ ను కంప్లీట్ చేయాలి. కానీ లేటైనా వీరి కాంబోలో వచ్చే మూవీ అదిరిపోతుందని అనిల్ రావిపూడి ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!</p

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus