Balakrishna: వీరసింహారెడ్డి కథ చెప్పేసిన బాలకృష్ణ.. ఇవే పాత్రలంటూ?

  • January 12, 2023 / 12:36 PM IST

వీరసింహారెడ్డి మూవీలో బాలయ్య డ్యూయల్ రోల్ లో కనిపిస్తారా? లేక సింగిల్ రోల్ లో కనిపిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం దొరకక బాలయ్య ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే తాజా ఇంటర్వ్యూలో బాలయ్య ఈ ప్రశ్నకు సంబంధించి పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. వీరసింహారెడ్డి సినిమాలో తాను తండ్రీకొడుకు పాత్రలలో కనిపిస్తానని వెల్లడించారు. అదే సమయంలో ట్రైలర్ లో వినిపించని ఒక డైలాగ్ ను ప్రమోషన్స్ లో బాలయ్య చెప్పారు. బాలయ్య మాట్లాడుతూ సినిమాలోని డైలాగ్స్ అన్నీ నచ్చాయని అన్నారు.

సాయిమాధవ్ బుర్రాకు ప్రేక్షకుల నాడి తెలుసని బాలకృష్ణ కామెంట్లు చేశారు. నా నోటి నుంచి ఏ డైలాగ్స్ పలికితే బాగుంటాయో అవే డైలాగ్స్ ను ఆయన పలికించారని బాలయ్య చెప్పుకొచ్చారు. సన్నివేశానికి అనుగుణంగా ఆయన డైలాగ్స్ రాస్తారని బాలకృష్ణ కామెంట్లు చేశారు. మూవీలో మినిష్టర్ ను కలిసే సమయంలో చెప్పే డైలాగ్ బాగుంటుందని ఆయన తెలిపారు. ఈ సినిమాలో ఫైట్ చేసే సమయంలో నమ్మిన బంటు అయిన సిద్ధప్పాతో “సిద్ధప్పా కమ్ముకొస్తున్న

కర్నూలోళ్లు చుట్టుముట్టిన చిత్తూరోళ్లు కాపుకాస్తున కడపోళ్లు కత్తి కట్టిన అనంతపూరోళ్లు ఏసుకొస్తున్నారు.. ఎండ నడినెత్తికెక్కేలోపు నా కొడుకుల్ని నరికి ఈ మట్టికి ఎరువేసి పోదాం” అని డైలాగ్ చెబుతానని బాలయ్య చెప్పుకొచ్చారు. థియేటర్లలో బాలయ్య డైలాగ్స్ కు గూస్ బంప్స్ వస్తాయని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా బాలయ్య తన వ్యక్తిగత అలవాట్లను సైతం చెప్పుకొచ్చారు.

నాకు చుట్ట కాల్చే అలవాటు ఉందని ఉదయం మూడున్నరకు నిద్ర లేచి చుట్ట కాలుస్తానని బాలయ్య తెలిపారు. వీరసింహారెడ్డి పాత్రకు చుట్ట పెట్టామని గుండెల్లో రగులుతున్న ఆవేశం, కోపాన్ని ఈ విధంగా చూపిస్తే బాగుంటుందని అనిపించిందని బాలయ్య చెప్పుకొచ్చారు. బాలయ్య ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus