Balakrishna: టెన్షన్ పడుతున్న నందమూరి ఫ్యాన్స్.. కారణమిదే?

  • December 4, 2021 / 05:37 PM IST

బాలకృష్ణ నటించిన అఖండ సినిమాకు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వీకెండ్ నాటికి కొన్ని ఏరియాలలో అఖండ బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉందని సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఈ ఏడాది విడుదలైన టాప్ 3 సినిమాలలో నిలిచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. సింహా, లెజెండ్ స్థాయిలో కథాకథనాలు లేకపోయినా బాలయ్య అభిమానులను మాత్రం అఖండ ఆకట్టుకుంది.

అయితే ఏపీలోని ఉత్తరాంధ్ర జిల్లాలను తుఫాను గండం వెంటాడుతుండటంతో బాలయ్య అభిమానులు టెన్షన్ పడుతున్నారు. భారీ వర్షాలు కురిస్తే థియేటర్లకు వచ్చి ప్రేక్షకులు సినిమా చూసే పరిస్థితి ఉండదు. జవాద్ తుఫాను విషయంలో ప్రభుత్వం ఇప్పటికే ప్రజలను అప్రమత్తం చేసింది. సోమవారం వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కలెక్షన్లు వస్తాయనుకునే సమయంలో అకాల వర్షాల వల్ల నందమూరి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరోవైపు కర్ణాటకలో, ఓవర్సీస్ లో కూడా అఖండ మూవీకి భారీస్థాయిలో కలెక్షన్లు వస్తున్నాయి.

బాలయ్య తర్వాత సినిమాలకు గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తాయని బాలయ్య అభిమానులు భావిస్తున్నారు. త్వరలో బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ షూటింగ్ మొదలుకానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది సెకండాఫ్ లో రిలీజ్ కానుంది.

అఖండ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

‘అఖండ’ మూవీ నుండీ గూజ్ బంప్స్ తెప్పించే 15 డైలాగ్స్..!
సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి గురించి మనకు తెలియని విషయాలు..!
22 ఏళ్ళ రవితేజ ‘నీకోసం’ గురించి ఆసక్తికరమైన విషయాలు…!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus