Balayya Babu: అన్ స్టాపబుల్ నుంచి అదిరిపోయే అప్డేట్.. ట్రైలర్ వచ్చేది అప్పుడే?

  • October 1, 2022 / 07:23 PM IST

బుల్లితెరపై ఎన్నో కార్యక్రమాలు ప్రసారమవుతున్నప్పటికీ నందమూరి నటసింహం బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరించిన అన్ స్టాపబుల్ కార్యక్రమానికి ఎలాంటి క్రేజ్ దక్కిందో మనకు తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.బాలకృష్ణ ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారని తెలియడంతో ఎంతోమంది బాలకృష్ణ ఏంటి యాంకర్ ఏంటి అని ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమం ద్వారా బాలకృష్ణ అందరూ ఆశ్చర్యపోయే విధంగా తన వాక్చాతుర్యంతో ఎంతోమంది సెలబ్రిటీలను ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేశారు.

ఇలా మొదటి సీజన్ ఎంతో మంచి విజయం అందుకోవడంతో సీజన్ 2 కార్యక్రమాన్ని ప్రసారం చేయడానికి నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఇకపోతే ఈ కార్యక్రమానికి సంబంధించిన అన్ స్టాపబుల్ యాంథమ్ విడుదల అయ్యే ప్రేక్షకులనుఎంతో సందడి చేసింది. ఇది ఇలా ఉండగా తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేయడమే కాకుండా ఈ కార్యక్రమం ట్రైలర్ విడుదల తేదీని కూడా ప్రకటించారు.

ఈ కార్యక్రమానికి సంబంధించిన ట్రైలర్ అక్టోబర్ 4వ తేదీ విడుదల చేయనున్నట్లు నిర్వాహకుల ప్రకటించారు. ఇక ఈ కార్యక్రమం ఎప్పుడు ప్రసారమవుతుందా అని అభిమానులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మొదటి సీజన్ ద్వారా ఎంతగానో సందడి చేసిన బాలయ్య ఈసారి ఈ కార్యక్రమంలో మొదటిసారిగా ఎవరిని ప్రశ్నించనున్నారనే విషయం పై అందరిలో ఆత్రుత నెలకొంది.

ఇకపోతే ఈ కార్యక్రమానికి ఈసారి బాలకృష్ణ బావ చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ కార్యక్రమానికి అతిథిగా రాబోతున్నట్లు సమాచారం అయితే మొదటి గెస్ట్ గా ఈ కార్యక్రమానికి ఎవరు హాజరు కానున్నారో తెలియాల్సి ఉంది.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus