Varun Tej, Lavanya: వరుణ్ లావణ్యలకు బాలయ్య ఇచ్చిన గిఫ్ట్ ఇదేనా.. అసలేమైందంటే?

వరుణ్ తేజ్ లావణ్య జోడీ క్యూట్ జోడీ కాగా ఈ నెల 1వ తేదీన వరుణ్ లావణ్యల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. వరుణ్ లావణ్యలకు ఖరీదైన బహుమతులు వచ్చాయని తెలుస్తోంది. అయితే వరుణ్ లావణ్యలకు బాలయ్య అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం. వెంకటేశ్వరస్వామికి సంబంధించిన పెద్ద ఫోటోగ్రఫీని బాలయ్య బహుమతిగా ఇచ్చారని తెలుస్తోంది. వరుణ్ తేజ్ వెంకటేశ్వర స్వామిని ఎక్కువగా నమ్ముతారనే విషయం తెలిసి బాలయ్య ఈ గిఫ్ట్ ఇచ్చారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.

వైరల్ అవుతున్న ఈ వార్త మెగా, నందమూరి అభిమానులకు సంతోషాన్ని కలిగిస్తుండటం గమనార్హం. వెంకటేశ్వరస్వామి ఆశీర్వాదం వరుణ్ దంపతులకు ఉండాలని నెటిజన్లు ఫీలవుతున్నారు. ఈ స్పెషల్ గిఫ్ట్ వరుణ్ లావణ్య దంపతులకు ఎంతగానో నచ్చిందని తెలుస్తోంది. వరుణ్ తేజ్ సినీ కెరీర్ విషయానికి వస్తే వచ్చే నెల 8వ తేదీన ఆపరేషన్ వాలంటైన్ సినిమా రిలీజ్ కానుంది. వరుణ్ గత సినిమా గాండీవధారి అర్జున ప్రేక్షకులను తీవ్రస్థాయిలో నిరాశపరిచింది.

ఆపరేషన్ వాలంటైన్ తో వరుణ్ తేజ్ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. లావణ్య త్రిపాఠి సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొనసాగుతారా? లేదా? అనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది. వరుణ్ తేజ్ కమర్షియల్ అంశాలు ఉన్న సినిమాలకు ఎక్కువగా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. వరుణ్ తేజ్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే భారీ విజయాలు ఆయన ఖాతాలో చేరడం గ్యారంటీ అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

వరుణ్ లావణ్య కలిసి నటించాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. లావణ్య సినీ కెరీర్ విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. వరుణ్ తేజ్ (Varun Tej) లావణ్య జోడీని అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతుండటం గమనార్హం.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus