టాలీవుడ్ సింహం నందమూరి బాలకృష్ణ ప్రతిష్టాత్మక 100వ చిత్రం గౌతామీపుత్రశాతకర్ణి షూటింగ్ మధ్య ప్రదేశ్ లో శెరవేగంగా జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో సరికొత్తగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు క్రిష్. శాతవాహనుల రాజుల కధను, అమరావతి విసిస్టతను తెలుగు ప్రజలకు తెలిపే విధంగా ఈ సినిమా ఉండబోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను ఇప్పటివరకూ బాలయ్యబాబే తన భుజాలపై వేసుకుని నడిపించాడు. అయితే తాజాగా ఈ సినిమాలో రెండు కొత్త పాత్రలు ప్రవేశించాయి. అందులో ఒకటి బాలయ్య భార్యగా నటిస్తున్న శ్రియ కాగా, మరో పాత్ర తల్లి పాత్రలో నటిస్తున్న హేమమాలినీ.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో హేమమాలినీ షూటింగ్ కు తోలు రోజు రాగానే బాలయ్య అబ్దీరిపోయే గిఫ్ట్ ఇచ్చి మరీ వెల్కమ్ చెప్పాడట…ఇంతకీ బాలయ్య గిఫ్ట్ ఏంటి అంటారా…అయితే ఈ మ్యాటర్ చూడండి…హేమమాలిని తొలి రోజు షూటింగ్ కి రాగానే బాలయ్య…తను ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలోనే నేసిన లేపాక్షి చీరను హేమమాలినికి ప్రెజెంట్ చేశారట. ఇక నందమూరి నట సింహం తనకు ఇచ్చిన ప్రాధాన్యత, విలువ చూసి.. ఆ బాలీవుడ్ నటి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఒక్క సారిగా గతంలోకి వెళ్ళి సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి తాను రెండు సినిమాలు చేసినప్పటి సంగతులను బాలయ్య తో షేర్ చేసుకున్నారట. అలా ఎన్టీఆర్ వారసుడిగా సినిమా ఎంట్రీ ఇచ్చిన బాలయ్య సినిమాల్లోనే కాదు గౌరవ మర్యాదల విషయంలో కూడా పెద్దాయాన్ని ఫాలో అవుతున్నాడు అని అభిమానులు మురిసిపోతున్నారు.