ఈరోజే ‘బాలయ్య’ క్లారిటీ ఇస్తాడా??

  • March 16, 2016 / 06:10 AM IST

నందమూరి బాలకృష్ణ…ఈ పేరు వింటేనే నందమూరి అభిమానుల గుండెలు ‘జై బాలయ్య’ నినాదంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాయి. కొన్ని కోట్ల కళ్ళు ఆయన్ని ఆరాధ్య దైవంగా కోలుస్తాయి. అలాంటి నటసింహం  బాలయ్య దాదాపుగా 99సినిమాలు, జయాపజయాలతో సంభందం లేకుండా పూర్తి చేసుకుని తన 100వ సినిమాను అభిమానులు ఎప్పటికీ మరచిపోని విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో ఈ సినిమాపై ఎన్నో నెలల నుండి కసరత్తులు చేస్తున్నాడు. అయితే ఈ కాల క్రమంలో 100వ సినిమాపై అనేక రూమర్స్ బయాటకు వచ్చాయి…ముఖ్యంగా ఈ సినిమాను ఎవరు తెరకెక్క్కిస్తున్నారు అన్న ఆలోచనలో… బోయపాటి శ్రీను, సింగీతం శ్రీనివాసరావు, అనిల్ రావిపూడి, పరుచూరి రవీంద్ర, కృష్ణవంశీ, ఇలా ఎందరో టాప్ దర్శకుల పేర్లు బయటకు వచ్చాయి కానీ చివరకు ఈ లిస్ట్ మొత్తం వచ్చి క్రిష్ దగ్గర ఆగినట్లు లేటెస్ట్ సమాచారం. అయితే క్రిష్ ఎంపికను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ, వస్తున్న వార్తల బట్టి చూస్తే మాత్రం, దాదాపుగా క్రిష్ దర్శకత్వంలో బాలయ్య తన 100వ సినిమాను చేయనున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే…ప్రస్తుతానికి బాలకృష్ణ మనసు క్రిష్ చెప్పిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ వైపు పూర్తి మొగ్గు చూపుతున్న క్రమంలో టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వాదన ప్రకారం, అదే ఫైనల్ అయ్యేలా కనిపిస్తుంది. ఇక ఈ విషయాన్ని చెప్పేందుకు ఈరోజు చాలా మంచి రోజుగా బాలయ్య భావిస్తున్నట్లు ఆయన సన్నిహిల వద్ద నుంచి వస్తున్న సమాచారం.

బాలయ్య జాతకరీత్యా బుధవారం బాగా కలిసి వచ్చే రోజు కావడంతో అమావాస్య తరువాత వస్తున్న ఈరోజు…అదే ఈ బుధవారం రోజున బాలకృష్ణ తన 100వ సినిమాకు సంబంధించి ఈ సాయంత్రంలోగా ఒక కీలక ప్రకటన చేస్తాడు అన్న వార్తలు ఫిలింనగర్ లో సందడి చేస్తున్నాయి. అయితే అదే క్రమంలో దాదాపుగా క్రిష్ తోనే 100వ సినిమా అని వార్త టాలీవుడ్ లో హల్‌చల్ చేస్తున్నప్పటికీ…ఎవ్వరూ ఊహించని మరో పేరు బాలయ్య నోటి వెంట వచ్చినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చివరి నిమిషంలో బాలయ్య మనసు మార్చుకుని ట్విష్ట్ ఇచ్చినా చప్పలేం. చూద్దాం మరి బాలయ్య ఎవరిని ఫైనల్ అంటాడో.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus