“బాలయ్య” నీకు హాట్స్ ఆఫ్!!!

నందమూరి బాలకృష్ణ…అవును ఈ పేరు చెబితేనే నందమూరి అభిమానుల గుండెలు అభిమానంతో ఉప్పొంగిపోతాయి. నట విశ్వరూపం తారక రామారావుగారి కుమారుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పటికీ ఎక్కడా ఆ ఇది చూపించకుండా డిఫరెంట్ సినిమాలు తీసుకుంటూ ముందుకు పోతున్నారు మన నట సింహం బాలయ్య. ఇదిలా ఉంటే తాజాగా బాలయ్య ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న తన 100వ చిత్రం గౌతామీపుత్ర శాతకర్ణి షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు. దానికి గల కారణం ఈ సినిమాను తెరకెక్కిస్తున్న క్రిష్ కు పెళ్లి కుదరడం, నిశ్చితార్థం అయిపోవడం… వెంటనే పెళ్లికి రెడీ అయిపోవడం అన్నీ చక చకా జరగడంతో బాలయ్య షూటింగ్ కు బ్రేక్ ఇచ్చాడు.

అయితే బ్రేక ఇచ్చిన బాలయ్య ఏం చేస్తున్నాడు?? అంటే…ఇంకేం చేస్తాడు రాజకీయ నాయకుడు కదా తన నియోజకవర్గంలో బిజీగా ఉండి ఉంటాడు అని అనుకుంటున్నారా…కాదండి కసరత్తు చేస్తున్నాడు. ఇంతకీ బాలయ్య చేస్తున్న కసరత్తు ఏంటంటే….సినిమా కోసం మరింత ఫ్లెక్సిబుల్ గా తయారయ్యేందుకు… ప్రత్యేకమైన ఫిట్ నెస్ చికిత్స తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా పొట్టభాగంలో కొవ్వును కాస్త తగ్గించి, యుద్ధాలు, గుర్రపుస్వారీకి అనువుగా ఉండేలా తన బాడీని షేప్ చేసుకుంటున్నారు. రాజుల సినిమా అంటే మాటలు కాదు. గుర్రంపైనే గడపాల్సి ఉంటుంది. కత్తితోనే సావాసం చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ చేయాలంటే ఫిజికల్ గా దృఢంగా ఉండాలి. అందుకే ఆరోగ్యానికి మరింత ఆయువును ఇస్తూ ముందుకు పోతున్నాడు బాలయ్య. ఏది ఏమైనా… బాలయ్య నువు సూపర్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus