Balakrishna, Boyapati Srinu: బోయపాటిపై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలయ్య!

  • January 21, 2022 / 02:56 PM IST

స్టార్ హీరో బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన అఖండ అంచనాలను మించిన విజయాన్ని సొంతం చేసుకుంది. బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అని ప్రేక్షకులు సైతం కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఈ కాంబినేషన్ లో అఖండ సీక్వెల్ భవిష్యత్తులో తెరకెక్కే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. తాజాగా అఖండ మూవీ 50 రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుంది. నేటి నుంచి హాట్ స్టార్ ఓటీటీలో అఖండ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

ఈ సినిమా 50 రోజుల వేడుక సుదర్శన్ థియేటర్ లో జరగగా బాలయ్య మాట్లాడుతూ ప్రపంచమంతా అఖండ 50 రోజుల వేడుకను జరుపుకుంటోందని అన్నారు. అఖండ 50 రోజుల వేడుక సంక్రాంతి తర్వాత జరుపుకున్న పండగలా ఉందని బాలయ్య తెలిపారు. నాన్నగారు గతంలో చేసిన పాత్రలను గుర్తు చేసుకుని చేయడం వల్లే శివుడి పాత్ర అద్భుతంగా వచ్చిందని బాలయ్య చెప్పుకొచ్చారు. తనను బోయపాటి శ్రీనును ఆ దేవుడే కలిపాడని మా కలయిక జన్మజన్మలదని తాను బోయపాటి శ్రీను కలిసి హ్యాట్రిక్ హిట్ సాధించామని బాలయ్య వెల్లడించారు.

భగవంతుడు తనకు కోట్ల సంఖ్యలో ఫ్యాన్స్ ను ఇచ్చారని తను చేస్తున్న ప్రయోగాలను అభిమానులు ప్రోత్సహిస్తున్నారని బాలయ్య అన్నారు. పాన్ వరల్డ్ సినిమా అనుకునేలా అఖండను సక్సెస్ చేసినందుకు కృతజ్ఞతలు అని బాలయ్య చెప్పుకొచ్చారు. దర్శకుడు బోయపాటి శ్రీను 100 కంటే ఎక్కువ థియేటర్లలో అఖండ 50 రోజుల వేడుక జరుపుకోవడం సంతోషాన్ని కలిగించిందని వెల్లడించారు. నిర్మాత నమ్మకాన్ని ఈ సినిమాతో నిలబెట్టుకున్నానని ఈ సినిమాను సీనియర్ ఎన్టీఆర్ కు అంకితం ఇస్తున్నానని బోయపాటి చెప్పుకొచ్చారు.

అఖండ 50 రోజుల వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరిగాయి. చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య ఖాతాలో సక్సెస్ చేరడంతో అభిమానులు సంతోషిస్తున్నారు. అఖండ 150 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ కలెక్షన్లను సాధించింది.

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus