అరవింద సమేత ఆడియో వేడుకకు బాలకృష్ణ

  • September 4, 2018 / 07:11 AM IST

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అరవింద సమేత వీర రాఘవ షూటింగ్ వేగంగా సాగుతోంది. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించినప్పటికీ ఆ బాధని మనసులో పెట్టుకొని షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఈ చిత్రాన్ని అక్టోబర్ 11 న రిలీజ్ చేయాలనీ కష్టపడుతున్నారు. ఈ సినిమాకి ఎస్ ఎస్ థమన్ సంగీతమందిస్తున్నారు. ఆ పాటలు వినాలని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆడియో రిలీజ్ వేడుకని త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నట్టు తెలిసింది. బాబాయ్.. అబ్బాయి లను ఒకే వేదికపై చూడాలని నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కానీ కుదరలేదు.

హరికృష్ణ మరణంతో బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య దూరం తగ్గింది. కలిసి మాట్లాడుకుంటున్నారు. బాలకృష్ణ ఎన్టీఆర్ కి అండగా నిలవనున్నారు. హరికృష్ణ లేని లోటుని కొంతైనా తీర్చాలని అనుకుంటున్నారు. అందుకోసమే “అరవింద సమేత” ఆడియో వేడుకకి రావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయాన్ని త్వరలోనే అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నారు. అందులో బిజీగా ఉన్నప్పటికీ తారక్ కోసం టైమ్ కేటాయించడం సంతోషం కలిగిస్తుందని నందమూరి అభిమానులు చెప్పారు. బాలయ్య ఈ వేడుకకి రావడం సినిమాపై మరింత క్రేజ్ ని పెంచుతుందని తెలిపారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus