ఆ కన్నడ సినిమా రీమేక్ చేస్తానంటున్న బాలకృష్ణ.!

  • March 21, 2018 / 07:46 AM IST

ప్రస్తుతం పెద్దాయన ఎన్టీయార్ జీవితం ఆధారంగా తెరకెక్కబోయే “ఎన్టీయార్” బయోపిక్ చిత్రాన్ని నిర్మాణ కార్యక్రమాలు, కాస్టింగ్ మరియు తన తండ్రిలా నటించడానికి తనని తాను సిద్ధం చేసుకొంటున్న బాలకృష్ణ. “ఎన్టీయార్” బయోపిక్ తర్వాత సినిమా ఏమిటనేది ఇప్పటివరకూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. అయితే.. ఎన్టీయార్ బయోపిక్ అనంతరం బాలయ్య  (Balakrishna) ఓ కన్నడ రీమేక్ సినిమాలో నటించబోతున్నాడని తెలుస్తోంది. ఆల్రెడీ సదరు ప్రొజెక్ట్ రీమేక్ రైట్స్ కొనడం కూడా జరిగిపోయిందట. ఇంతకీ ఏమిటా ప్రొజెక్ట్ అనుకొంటున్నారా..!?

గతేడాది కన్నడంలో విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న “ముఫ్తీ” చిత్రాన్నే బాలయ్య రీమేక్ చేయనున్నారు. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని ఇటీవల బాలకృష్ణ చూడడం జరిగిందట. అన్నీ కమర్షియల్ అంశాలతోపాటు మంచి సెంటిమెంట్ కూడా ఉండడంతో ఈ సినిమాని బాలయ్య తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాడట. ముఖ్యంగా తనను స్నేహితుడైన శివరాజ్ కుమార్ నటించిన సినిమా కావడంతో ఇంకాస్త ఆసక్తి చూపుతున్నాడు. మరి ఈ కన్నడ రీమేక్ కి ఎవరు దర్శకత్వం వహిస్తారు, ఎవరు నిర్మిస్తారు అనేది చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus