సంక్రాంతి బరిలోకి దిగనున్న బాలకృష్ణ
- June 13, 2017 / 11:14 AM ISTByFilmy Focus
నందమూరి బాలకృష్ణ యువహీరోల కంటే స్పీడ్ గా ఉన్నారు. ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పైసా వసూల్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 29 న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలకంటే మరో సినిమాని బాలకృష్ణ పట్టాలెక్కించనున్నారు. తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్ టైనర్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సి.కల్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే నెల 10 నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. అయితే ఈ సినిమాని మూడు నెలల్లో పూర్తి చేయాలని చిత్ర బృందం ఫిక్స్ అయింది. రెడ్డిగారు అనే పేరు పరిశీలనలో ఉన్న సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నట్లు సమాచారం.
2016 సంక్రాంతికి డిక్టేటర్ సినిమాను రిలీజ్ చేసిన బాలయ్య, ఈ ఏడాది సంక్రాంతికి తన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణిని థియేటర్లలోకి తీసుకొచ్చారు. వచ్చే ఏడాది కేఎస్ రవికుమార్ సినిమాను సంక్రాంతి కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మేము వస్తున్నామంటూ రామ్ చరణ్, మహేష్ బాబు ముందుగా ప్రకటించారు. రంగస్థలం, భరత్ అను నేను పెద్ద పండుగకు రానుంది. వారితో బాలయ్య పోటీ పడనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















