సినిమా పరిశ్రమలో ఏం చేసినా ముందు వెనుక ఆలోచించి చేస్తారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే అదే క్రమంలో సెంటిమెంట్స్ ను ఫాలో అవడంతో కూడా వాళ్ళు అందరికన్నా ముందే ఉంటారు. మంచి ముహూర్తం చూసుకుని సినిమా డేట్ ఫిక్స్ చేసినట్లే, అదే క్రమంలో తమ వాహనాలకు మంచి నంబర్ కోసం ఎన్ని లక్షలు ఖర్చు పెడతారో వారికే తెలీదు…ఇంతకీ ఈ కధ అంత ఇప్పుడు ఎందుకు అంటారా…అక్కడే ఉంది అసలు ట్విష్ట్. విషయంలోకి వెళితే…ఫాన్సీ నంబర్స్ కోసం మన తారలు ఎంతైనా వెచ్చిస్తారు అని తెలిసి, తమ నంబర్ ప్లేట్ ల మీద ఉన్న మోజు గ్రహించి ఎప్పటి నుంచో మన ఆర్టీవో వేలం పాట లో నెంబర్ లు అమ్ముతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే తాజాగా హైదరాబాద్ లో ఖైరతాబాద్ లో కొత్త సీరియల్ ప్రారంభం అవ్వడం, అదే క్రమంలో ఫ్యాన్సీ నెంబర్లు భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఇక ఆ కోవలో నందమూరి బాలకృష్ణ కి చెందిన కారు కూడా ఈ వేలం పాట లో ఉండడం గమనార్హం. ‘టీఎస్ 09 ఈయూ 0001’ నెంబర్ కోసం బాలకృష్ణ ఏకంగా 7.77 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు అని వార్తలు వస్తున్నాయి. అదే క్రమంలో ఆయన కంటే ముందు తొమ్మిది అంకె కోసం గవి కన్స్ట్రక్షన్స్ అనే సంస్థ తమ బెంజ్ కారు కి ఈ నెంబర్ ని పది లక్షలు పెట్టి కొనుక్కుంది. అంతేకాకుండా ‘టీఎస్ 09 ఈయూ 0099’ నంబర్ ను ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ 2.70 లక్షలకు సొంతం చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే నెంబర్ 1 మీద బాలయ్య కి చాలా కాలం నుంచీ ఇష్టం, అదే క్రమంలో అందరూ పిలిచే సో కాల్డ్ సెంటిమెంట్ ఇప్పుడు ఈ నంబర్ కి దాదాపుగా 7.7లక్షలు ఖర్చు పెట్టేలా చేశాయి. ఇక్కడ ఇంకో గమ్మత్తు అయిన విషయం ఏంటి అంటే ఆయన కార్ల లో దాదాపు అన్నీ ఒకటి అంకె తోనే ఉండడం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.