గౌతమి పుత్ర శాతకర్ణి తర్వాత బాలకృష్ణ మరింత ఉత్సాహంతో సినిమాలు చేస్తున్నారు. తన కెరీర్ స్పీడ్ పెంచారు. అత్యంత వేగంగా పైసా వసూల్ మూవీ చేసిన బాలకృష్ణ.. ప్రస్తుతం తమిళ దర్శకుడు కె ఎస్ రవికుమార్ దర్సకత్వంలో “జై సింహా” చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ వేగంగా సాగుతోంది. ఈ సినిమాని జనవరి 13 న విడుదల చేయడానికి నిర్మాత సి కళ్యాణ్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ తన తండ్రి నందమూరి తారక రామారావు బయోపిక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. తేజ దర్శకత్వం వహించనున్న ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
అయితే ఇదే సమయంలో ప్రముఖ కథా రచయిత చిన్ని కృష్ణ చెప్పిన కథకు బాలయ్య ఒకే చెప్పారని ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఆ కథ 2001లో బి.గోపాల్ దర్శకత్వం వహించిన నరసింహనాయుడు సినిమాకి సీక్వెల్ అని సమాచారం. చాలా కాలం పాటు అలోచించి చిన్నికృష్ణ ఈ స్టోరీని ప్రిపేర్ చేశారని.. ఇది కూడా తప్పకుండా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని ప్రచారం జోరందుకుంది. అయితే ఈ కథని బి గోపాల్ డైరక్ట్ చేస్తారా?, లేక నేటి డైరక్టర్లు దర్శకత్వం వహిస్తారా? అనే విషయం ఇంకా బయటికి రాలేదు.