చిరంజీవిలో నచ్చనిది, నాలో నచ్చింది ఏంటి?.. రాధికను ఇరకాటంలో పడేసిన బాలయ్య..!

  • November 17, 2022 / 08:18 PM IST

తెలుగు ఆడియన్స్, బాలయ్య ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ‘అన్‌స్టాపబుల్’ సెకండ్ సీజన్ నుండి 4వ ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమో వచ్చేసింది.. ఈ ఎపిసోడ్‌లో ముచ్చటగా ముగ్గురు గెస్టులను తీసుకొచ్చారు బాలయ్య.. తన క్లాస్‌మెట్ కమ్ ఫ్రెండ్ అయిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి.. అలాగే అలనాటి అందాల తార రాధికలు అతిథులుగా విచ్చేశారు..‘స్నేహమే నా జీవితం’ అంటూ సాంగ్ స్టార్ట్ చేసిన బాలయ్య, ఇది ఫ్రెండ్లీ ఎపిసోడ్ అని రివీల్ చేశారు..

ముందుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఆహ్వానించారు.. బాలయ్య: ‘అధ్యక్షా.. నా మైక్ ఆపేశారు అధ్యక్షా’ అనగానే.. తాను స్పీకర్ అయిన తర్వాత అర్థరాత్రి 12 గంటలకు ఫోన్ చేసి ఇదే మాట్లాడాడు బాలకృష్ణ అని చెప్పారు కిరణ్ కుమార్ రెడ్డి.. నిజాం కాలేజీలో చదువుకునే రోజుల్లో మేం చేసినవి చూస్తే ఎవరూ నమ్మరు.. నిజంగా చేశారా.. లేక నటిస్తున్నారా అనుకుంటారు అని బాలయ్య అంటే.. అక్కడ చేశాకే ఇక్కడ నటుడివయ్యావంటూ కౌంటర్ ఇచ్చారు కిరణ్..

ఎప్పుడూ క్లాస్ బయటే ఉండేవాణ్ణి కాబట్టి నేను ఔట్ స్టాండింగ్ స్టూడెంట్ అయ్యనంటూ ఎంటరయ్యారు మరో ఫ్రెండ్ సురేష్ రెడ్డి.. అమ్మాయిలకి సైట్ కొట్టడానికి బైక్స్ మార్చుకునే వాళ్ళమని బాలయ్య అంటే.. ఆ ఫీల్డ్‌లో వీళ్లిద్దరే హీరోలు అంటూ పంచ్ వేశారు కిరణ్ కుమార్.. బాలయ్య వీళ్లతో కలిసి క్రికెట్ ఆడుతుండగా రాధిక ఎంట్రీ ఇవ్వడం హైలెట్.. నేను చెన్నైలో ఉన్నప్పుడు రాధిక నా గాడ్ ఫాదర్ అంటూ పొగిడేసిన బాలయ్య..

రజినీ కాంత్, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, చిరంజీవి, విజయ్ కాంత్ అందరితోనూ నటించావ్.. నాలాంటి సూపర్ స్టార్‌తో నీకు ఛాన్స్ రాలేదని ఆటపట్టిస్తూ.. ‘చిరంజీవిలో నీకు నచ్చనిది.. నాలో నీకు నచ్చిందేంటి?’ అంటూ రాధికను ఇరకాటంలో పడేశారు.. మొత్తానికి వీరి మధ్య ఉన్న స్నేహం, జ్జాపకాలు, కాలేజీ రోజుల్లో చేసిన అల్లరి పనులు, సినిమాలు, స్నేహితుల రాజకీయ అనుభవాలు.. ఇలాంటి అన్ని ఆసక్తికరమైన విషయాలతో నాలుగో ఎపిసోడ్ అదిరిపోతుందని ప్రోమో చూస్తే తెలుస్తుంది.. నవంబర్ 25న ఈ ఎపిసోడ్ స్ట్రీమింగ్ కానుంది..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus