Balakrishna: ఆ దమ్ము ఎవరికీ ఉంది… ఎఫైర్స్ పై బాలయ్య స్టన్నింగ్ సమాధానం?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా మాత్రమే కాకుండా వ్యాఖ్యాతగా కూడా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. ఈయన ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఈ కార్యక్రమం మొదటి సీజన్ మంచి విజయం కావడంతో రెండవ సీజన్ కూడా అంతే ఘనంగా ప్రారంభించారు. ఇప్పటికే ఈ కార్యక్రమం కూడా రెండు ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. ఇక ఈ కార్యక్రమం మూడవ ఎపిసోడ్ లో భాగంగా యంగ్ హీరోలు అడివి శేష్ శర్వానంద్ హాజరయ్యారు.

ఈ యంగ్ హీరోలతో కలిసి బాలయ్య చేసిన హంగామా మామూలుగా లేదని చెప్పాలి. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా శర్వానంద్ బాలకృష్ణను ఓ ప్రశ్న వేశారు. మీరు ఎంతో మంది హీరోయిన్లతో పనిచేశారు కదా మీ గురించి ఎవరితోనూ ఎలాంటి అఫైర్స్ రూమర్స్ రాలేదు ఎలా మేనేజ్ చేశారు అంటూ సందేహం వ్యక్తం చేశారు ఈ ప్రశ్నకు బాలకృష్ణ స్టన్నింగ్ సమాధానం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.మన గురించి పుకార్లు రాస్తే దమ్ము ఎవరికుంది అంటూ ఊర మాస్ లెవెల్లో ఈయన సమాధానం చెప్పారు.

ఇలా బాలకృష్ణ సమాధానం చెప్పడంతో ఈ యంగ్ హీరోలు ఇద్దరు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అప్పట్లో సోషల్ మీడియా లేకపోవడం వల్ల హీరోల గురించి పుకార్లు పెద్దగా వ్యాప్తి చెందేవి కాదు. ఇక జర్నలిస్టులు హీరోల గురించి ధైర్యం చేసి ఇలాంటి లవ్ ఎఫైర్స్ గురించి లేదా పుకార్ల గురించి రాయాలని ప్రయత్నించిన అవి ప్రింట్ అయ్యేలోపు చేరాల్సిన వారికి చేరేవి. దాంతో ఆ ఎఫైర్స్ గాల్లో కలిసిపోయేవి.

తద్వారా అప్పట్లో హీరోల గురించి పెద్దగా ఇలాంటి పుకార్లు వచ్చేది కాదని చెప్పారు. అయితే కొంతమంది హీరోల గురించి మాత్రమే బయటకు వచ్చేది అయితే ప్రస్తుతం సోషల్ మీడియా అభివృద్ధి చెందడంతో ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus