Balakrishna: కాలేజ్‌కు వెళ్లనున్న బాలయ్య.. ఆ పాత్రలో..?

  • June 29, 2021 / 08:50 PM IST

టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా నటించిన ఒక్క సినిమా కూడా గతేడాది రిలీజ్ కాలేదనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది బాలయ్య నటించిన అఖండ మూవీ రిలీజ్ కానుండగా గోపీచంద్ మలినేని బాలకృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ఈ ఏడాదే ప్రారంభం కానుంది. అనిల్ రావిపూడి చెప్పిన కథకు ఇప్పటికే బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా సి కళ్యాణ్ నిర్మాతగా బాలయ్య ఒక సినిమాకు ఓకే చెప్పినట్టు గత రెండు రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ సినిమాకు మొదట శ్రీవాస్ పేరు వినిపించినా సంపత్ నంది ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం సంపత్ నంది గోపీచంద్, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సీటీమార్ సినిమా తెరకెక్కుతోంది. చరణ్ హీరోగా తెరకెక్కిన రచ్చ సినిమాకు సంపత్ నంది దర్శకత్వం వహించి సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. సంపత్ నంది కెరీర్ లో హిట్లు బాగానే ఉన్నా స్టార్ హీరోలు సంపత్ నందికి ఎక్కువగా ఆఫర్లు ఇవ్వడం లేదనే సంగతి తెలిసిందే.

సంపత్ నంది ఇప్పటికే స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని బాలయ్య సినిమాలో ఎక్కువగా కాలేజ్ లో కనిపిస్తారని సమాచారం. అయితే బాలయ్య లెక్చరర్ పాత్రలో కనిపిస్తారా..? లేక ఇతర పాత్రలో నటిస్తారేమో చూడాల్సి ఉంది. ఎమోషనల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంటుంది.

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus