Balakrishna: మోక్షజ్ఞ తండ్రిని అలా తిడతారా… పరువు మొత్తం పోగొట్టుకున్న బాలయ్య!

నందమూరి నటసింహం బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్నటువంటి తాజా చిత్రం భగవంత్ కేసరి. ఈ సినిమా దసరా పండుగ సందర్భంగా అక్టోబర్ 20 వ తేదీ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో చిత్ర బృందం కూడా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఈ సినిమా నుంచి తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.

ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు అయితే ఈ కార్యక్రమంలో ఎప్పటిలాగే బాలకృష్ణ మాట్లాడుతూ నోరు జారారు. ఇలా బాలయ్య చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారడంతో పలువురు బాలయ్య వ్యాఖ్యలపై విమర్శలు చేస్తున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణకు కూతురి పాత్రలో యంగ్ హీరోయిన్ శ్రీ లీల నటించిన సంగతి తెలిసిందే.

అయితే శ్రీ లీల గురించి బాలకృష్ణ మాట్లాడుతూ తను హీరోయిన్ గా తనతో ఒక సినిమా చేయాలని ఉంది అంటూ తెలిపారు అయితే ఇదే విషయాన్ని తన ఫ్యామిలీ ముందు కూడా చెప్పడంతో తన కుమారుడు మోక్షజ్ఞ ఏం గ్రౌండ్ ఫ్లోర్ బలిసిందా డాడీ అంటూ తనని తిట్టారని బాలయ్య ఈ సందర్భంగా వెల్లడించారు. హీరోగా ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నప్పుడు నువ్వు తనతో సినిమా చేయడం ఏంటి అంటూ తనని తిట్టారని బాలయ్య తెలియజేశారు.

బాలకృష్ణ తన కుమారుడు తనని బలిసిందా అంటూ మాట్లాడారని బాలకృష్ణ చెప్పినప్పటికీ ఈయన వ్యాఖ్యలపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి. అసలు మోక్షజ్ఞకు తన తండ్రితో ఎలా మాట్లాడాలి అనే విషయం కూడా తెలియదా మరి అంత సంస్కారహీనుడా అంటూ విమర్శలు చేస్తున్నారు. బాలయ్య ఏదో గొప్పగా చెప్పే ప్రయత్నం చేసి తన కొడుకు గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరి ముందు తన కొడుకు పరువు తీయడమే కాకుండా తన పరువును కూడా తీసుకున్నారనే చెప్పాలి. ఏది ఏమైనా బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus