తాజాగా జరిగిన ‘ఎన్టీఆర్’ ఆడియో వేడుకలో సుమంత్ పై బాలయ్య సంచలన కామెంట్స్ చేసాడు. వివరాల్లోకి వెళితే క్రిష్ జాగర్లమూడి డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ – బయోపిక్ లో అక్కినేని నాగేశ్వరరావు ‘ఏయన్నార్’ పాత్రను ఆయన మనువడు సుమంత్ పోషించిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్, ఏయన్నార్ కలిసి ఎన్నో మల్టీ స్టారర్ చిత్రాలు చేసారు. ఇలా వచ్చిన చాలా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. ఇక వీరిద్దరి మధ్య కూడా మంచి స్నేహ ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విధంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు వీరిద్దరూ రెండు పిల్లర్స్ లాంటి వాళ్ళు. ‘ఎన్టీఆర్’ బయోపిక్ లో వీరి స్నేహ బంధం ఎలా ఏర్పడిందనేది ఈ చిత్రంలో చూపించబోతున్నట్టు సుమంత్ చెప్పుకొచ్చాడు.
ఇక ఈ ఆడియో ఫంక్షన్లో ‘ఎన్టీఆర్’ పాత్ర పోషించిన బాలకృష్ణ మాట్లాడుతూ… ఈ చిత్ర షూటింగ్ టైములో మొదటి రోజు వచ్చిన సుమంత్ నన్ను మామయ్యా అన్నాడు – మామయ్య ఏంట్రా.. మామయ్యా .. అని నేను అన్నాను – నాకు మామయ్య అంటే నచ్చుదు – నా మనవడు నలుగురిలో నన్ను తాతయ్య అన్నా.. కూడా నాకు నచ్చదు. ఇంట్లో అంటే పర్వాలేదు కానీ నలుగురిలో అలా పిలిస్తే నాకు అస్సలు ఇష్టం ఉండదు. అయితే సుమంత్ నన్నో డౌట్ అడిగాడు… మామయ్యా..! రామారావు గారి కంటే నాగేశ్వర రావు గారు పొట్టి కదా…! మరి ఈ చిత్రంలో నువ్వు నాకంటే పొడువు తక్కువగా ఉన్నావు ఎలా అని అడిగాడు..? దానికి నేను ఈ సినిమాలో నిన్ను నన్ను ఎవరు చూడరు…! ఎన్టీఆర్ – ఏయన్నార్ లు లానే చూస్తారు. ఒక సన్నివేశం అద్బుతంగా వచ్చినప్పుడు.. అందులో నటీనటులు గుర్తుండరు…. కేవలం పాత్రలు మాత్రమే గుర్తుంటాయని చెప్పను. సుమంత్ ఈ చిత్రంలో చాలా చక్కటి నటన కనపరిచాడు. సుమంత్ కు నాకు మధ్య వచ్చే సన్నివేశాలు కచ్చితంగా ఆకట్టుకుంటాయి.. అంటూ బాలకృష్ణ చెప్పుకొచ్చాడు.