Balakrishna: బాలయ ఆధ్వర్యంలో భోజనశాల.. ఆ రెండు ప్రాంతాల్లో?

  • May 27, 2022 / 08:48 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఒకవైపు ఎమ్మెల్యేగా, మరోవైపు హీరోగా విజయవంతంగా రెండు పడవల ప్రయాణం చేస్తున్నారు. అఖండ సినిమాతో గతేడాది సంచలన విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. తండ్రిపై తనకు ఉన్న ప్రేమను బాలకృష్ణ ఈ విధంగా చాటుకుంటున్నారు. అయితే ఎన్టీఅర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ఏపీలోని పలు ప్రాంతాల్లో అన్నగారి భోజనశాలలు ఏర్పాటు అవుతున్నాయి. బాలయ్య ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో

అన్నగారి భోజనశాల ద్వారా 2 రూపాయలకే నాణ్యమైన భోజనం పేద ప్రజలకు అందనుంది. బాలకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న ఈ భోజనశాలల ద్వారా ఎంతోమంది పేదల కడుపు నిండనుంది. హిందూపురంతో పాటు గుంటూరులో కూడా అన్నగారి భోజనశాల ఏర్పాటు కానుండగా ఇక్కడ 5 రూపాయలకు భోజనం అందించనున్నారని తెలుస్తోంది. గుంటూరులో ప్రతిరోజూ 1000 మంది ఆకలి తీర్చేలా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అన్న క్యాంటీన్లు లేకపోవడంతో వీటిని ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు అఖండ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్న బాలయ్య కొత్త కథలను కూడా వింటున్నారని సమాచారం అందుతోంది. మరో 13 రోజుల్లో బాలయ్య పుట్టినరోజు అనే సంగతి తెలిసిందే. బాలయ్య పుట్టినరోజు కానుకగా ఎలాంటి అప్ డేట్స్ వస్తాయో అని బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలయ్య కొత్త సినిమా టీజర్ జూన్ 10వ తేదీన విడుదలయ్యే ఛాన్స్ ఉంది.

గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా అనంతపురం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. సినిమాలో మైనింగ్ కు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. శృతి హాసన్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపిస్తారని సమాచారం. భారీ బడ్జెట్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా దసరా కానుకగా థియేటర్లలో రిలీజయ్యే ఛాన్స్ ఉందని ప్రచారం జరుగుతోంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus