Balakrishna: అదే నాకు శ్రీరామ రక్ష అంటున్న బాలయ్య!

  • May 30, 2022 / 12:28 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా చిలుకలూరిపేటలోని రామకృష్ణ థియేటర్ లో 175 రోజులు పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆదివారం రోజున థియేటర్ లో వేడుకలు జరగగా ఈ వేడుకకు బాలకృష్ణ, బోయపాటి శ్రీను హాజరయ్యారు. బాలకృష్ణ మాట్లాడుతూ నాన్న శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సమయంలో అఖండ సిల్వర్ జూబ్లీ వేడుకలు జరగడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.

నాన్న ఆశయాలను, కలలను నిలబెట్టాననే గర్వం, ఆత్మ తృప్తి గుండెల నిండా ఉందని బాలయ్య చెప్పుకొచ్చారు. నాన్నకు ఈ సినిమాను అంకితం చేస్తున్నానని ప్రపంచం ఏ నటుడు చేయనన్ని పాత్రలను నాన్న పోషించారని నాన్న చేయని సినిమాలు లేవని ఆ పుణ్య దంపతుల బిడ్డగా పుట్టడంతో విభిన్నమైన పాత్రలు పోషించే ఛాన్స్ తనకు దక్కిందని బాలయ్య తెలిపారు. సినిమా చేసే సమయంలో చిత్తశుద్ధితో చేస్తానని బోయపాటి శ్రీనుపై తనకెంతో కాన్ఫిడెన్స్ అని బాలయ్య తెలిపారు.

ఇన్నిరోజులు నేను సంపాదించుకున్న ఆస్తి అభిమానమే అని ప్రేక్షకులు చూపించే అభిమానం తనకు శ్రీరామరక్ష అని బాలయ్య తెలిపారు. బాలయ్య చేసిన ఈ కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అఖండ 175 రోజుల పాటు రామకృష్ణ థియేటర్ లో ప్రదర్శించబడటంతో అభిమానులు సైతం ఎంతగానో సంతోషిస్తున్నారు. దర్శకుడు బోయపాటి శ్రీనుకు, ప్రగ్యా జైస్వాల్ కు ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది.

అఘోరా పాత్రలో బాలయ్య అద్భుతంగా నటించి మెప్పించారు. ఈ సినిమాలో థమన్ బీజీఎం నెక్స్ట్ లెవెల్ లో ఉందని ప్రేక్షకుల నుంచి కామెంట్లు వినిపించాయి. అఖండ సినిమాలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డికి ఈ సినిమా మంచి లాభాలను అందించింది. ఈ సినిమాకు బాలయ్య 11 కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకున్నారు.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus